Sunday, May 26, 2019
Home Latest ‘ప్రాణం ఖ‌రీదు’ మూవీ రివ్యూ

‘ప్రాణం ఖ‌రీదు’ మూవీ రివ్యూ

0
2667
‘ప్రాణం ఖ‌రీదు’ అనే చిరంజీవి హిట్ సినిమా టైటిల్ తో మ‌రో చిన్న సినిమా రిలీజయింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉందో స‌మీక్ష‌లో చూద్దాం.
రామ్ (ప్ర‌శాంత్) అనే క్యాబ్ డ్రైవ‌ర్ ఒక పెద్ద రేంజ్ డాక్ట‌ర్ ను, ఇంకో మ‌ధ్య‌వ‌ర్తిని కిడ్నాప్ చేస్తాడు. కాసేప‌టికి అస‌లు రామ్ ఆ కిడ్నాప్ చేయ‌డానికి గ‌ల కార‌ణాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతుంటాయి. అస‌లు రామ్ ఎవ‌రు? త‌ను ఆ కిడ్నాప్ ఎందుకు చేస్తాడు లాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే ఈ సినిమా.
హీరో ప్ర‌శాంత్ లుక్స్, న‌ట‌న రెండింటిలోనూ ఓకే. ఎమోష‌నల్ సీన్స్ లో మంచి న‌ట‌న క‌న‌బ‌రిచాడు. హీరోయిన్ అవంతిక‌కు మంచి పాత్ర దొరికింది. ఆ పాత్ర‌కు త‌ను పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా హాస్పిట‌ల్ సీన్ లో న‌ట‌న సూప‌ర్బ్. తార‌క ర‌త్న పోలీస్ పాత్ర‌కు న్యాయం చేశాడు. మిగిలిన వారు త‌మ త‌మ పాత్ర‌ల ప‌రిధి మేర బాగానే చేశారు.
క‌థ‌లో కొత్త‌ద‌న‌మేమీ లేక‌పోయిన‌ప్ప‌టికీ అవయ‌వాల మాఫియా గురించి అంద‌రికీ తెలిసేట్లు  చేయ‌డంలో డైర‌క్ట‌ర్ పీఎల్‌కే రెడ్డి స‌క్సెస్ అయ్యాడు. ఇంకొంచెం క‌థ‌నం మీద దృష్టి పెట్టుంటే మంచి సినిమాగా ఎప్ప‌టికీ ప్రేక్ష‌కుల‌కు గుర్తుండేది. సినిమాటోగ్ర‌ఫీ బావుంది. పాట‌లు ఆశించిన స్థాయిలో లేవు. కొన్ని కొన్ని స‌న్నివేశాల్లో రీరికార్డింగ్ బావుంది. ఎడిటింగ్ ఇంకాస్త బావుండాల్సింది. చిన్న సినిమా అయిన‌ప్ప‌టికీ నిర్మాణ విలువ‌లు బావున్నాయి.
ప్ల‌స్ పాయింట్స్ః 
హీరో హీరోయిన్స్ న‌ట‌న‌
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్
మైన‌స్ పాయింట్స్ః 
రొటీన్ స్టోరీ

పంచ్‌లైన్ః ‘ప్రాణం ఖ‌రీదు’ సందేశం బానే ఉంది
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 2.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here