“పోస్ట‌ర్” టైటిల్ ఆవిష్క‌ర‌ణ‌

0
167
శ్రీ సాయి పుష్ప క్రియేష‌న్స్ లో  టి.ఎం.ఆర్ ద‌ర్శ‌కుడు గా,  విజ‌య్ ధ‌ర‌ణ్, అక్షతసోనావానే, రాశిసింగ్ హీరో హీరోయిన్స్ గా శేఖ‌ర్ రెడ్డి, గంగారెడ్డి, ఐ.జి.రెడ్డి నిర్మాత‌లు గా “పోస్టర్” అనే సినిమా రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే ఈ చిత్రం 80శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.  శివాజీ రాజా మాట్లాడుతూ- “ఒక ద‌ర్శ‌కుడికి  ఇది మొదటి సినిమా అయిన  క్లారిటీగా, బాగా చేస్తున్నాడు. ప్ర‌తి ఒక్క‌రూ ఈ సినిమాని తమ సొంత సినిమాలా ఫీలయ్యి ప‌ని చేస్తున్నారు.  క‌థ‌కు కరెక్ట్ గా సరిపోయే టైటిల్ “పోస్టర్” అన్నారు.
నటి మధుమణి మాట్లాడుతూ”  హీరో తల్లిగా ఈ సినిమాలో నటిస్తున్నాను. డైరెక్టర్ పోస్టర్ కథ చెప్పినప్పుడే చాలా బాగా నచ్చింది. మధ్య తరగతి కుటుంబంలో  కష్టనష్టాలను చూపిస్తూ  ఒక కుర్రాడు ఉన్నత స్థానంలోకి వెళ్ళితే ఆ తల్లిదండ్రులు పొందే ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు TMR గారికి, కృతజ్ఞతలు”అన్నారు.
ద‌ర్శ‌కుడు మ‌హిపాల్ రెడ్డి  మాట్లాడుతూ – కొత్త పాత త‌రం న‌టీన‌టుల‌తో తీస్తున్న చిత్ర‌మిది. సిద్ధిపేట ప‌రిస‌రాల్లో, హైదరాబాద్ లో షూటింగ్ చెయ్యడం జరిగింది. సినిమా బ్యాక్ డ్రాప్ లో జరిగే క‌థ ఇది. పోస్ట‌ర్‌లు కూడా అతికించుకునెందుకు పనికి రాని ఓ కుర్రాడు   పోస్టర్ మీదికి ఎలా ఎక్కాడు అనేది ఇంట్రస్టింగ్ డ్రామా తో చెప్పడం జరిగింది“అన్నారు.
హీరో విజయ్ దరణ్ మాట్లాడుతూ- “ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామాతో పాటు అన్ని ఎమోష‌న్స్ ఉన్న చిత్ర‌మిది.. ల‌వ్, డ్రామా ఆక‌ట్టుకుంటాయి” అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ ” 80 శాతం టాకీ, రెండు పాటలు పూర్తి అయ్యాయి. మిగిలిన రెండు పాటలు ఔట్ డోర్ లో చిత్రీకరించడం జరుగుతుంది” అని తెలిపారు.
శివాజీరాజా, కాశీ విశ్వ‌నాథ్, మ‌ధుమ‌ణి, రామ‌రాజు, నివాస్, స్వ‌ప్నిక‌, కీర్తికా, అరుణ్ బాబు త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రానికి సంభాష‌ణ‌లు:  నివాస్.  కెమెరా: శ్రీ‌కాంత్‌, సంగీతం :  శాండీ అద్దంకి, పాట‌లు:  పెద్దాడ మూర్తి, చైత‌న్య వ‌ర్మ‌, ల‌క్ష్మీ ప్రియాంక‌, డ్యాన్స్‌:  అజ‌య్ శివ‌శంక‌ర్, అమిత్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: ఆర్.శ్రీ‌నివాస్ రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here