విశాల్ అరెస్ట్ వెనక రాజకీయ కోణం ఉందా..?

0
144
విశాల్.. కోలీవుడ్ ఫిల్మ్ స్టార్ అయినా రియల్ లైఫ్ లోనూ హీరోగానే ఉంటాడు అనే పేరుంది. ఎంతోమందికి ఎన్నోసార్లు సాయం చేశాడు. చెన్నై వరదలప్పుడు స్వయంగా తను వీధుల్లోకి వెళ్లి వేలమందిని ఆదుకున్నాడు. అంతకుముందే శరత్ కుమార్ టీమ్ తో పోటీపడి తీవ్ర విమర్శల మధ్య కోలీవుడ్ నిర్మాతల మండలి, నడిగర్ సంఘం అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. నడిగర్ సంఘానికి సొంత బిల్డింగ్ నిర్మించిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని శపథం కూడా చేశాడు. అయితే విశాల్ ఎన్నికపై మొదట్నుంచీ కొందరు అసంతృప్తితో ఉన్నారు. వాళ్లంతా కలిసి నిన్న (19.12.18) నిర్మాతల మండలి ఆఫీస్ కు తాళాలు వేసి తాళం పోలీస్ స్టేషన్ ఇచ్చారు. కానీ విశాల్ ఆ తాళం పగలగొట్టి ఆఫీస్ లో అడుగుపెట్టాడు. దీంతో పోలీస్ లు వచ్చిన విశాల్ తో పాటు అతని అనుచరులను అరెస్ట్ చేశారు.  వరస చూస్తోంటే దీని వెనక పొలిటికల్ యాంగిల్ కూడా ఉన్నట్టు తెలుస్తోందంటున్నారు చాలామంది. నిజానికి విశాల్ ఎన్నికైన దగ్గర్నుంచీ నిర్మాతల శ్రేయస్సుకోసమే పనిచేశాడు.
అయితే అతని వ్యతిరేకులు చెబుతోన్న విషయాలు కూడా వాస్తవానికి దగ్గరగానే ఉన్నాయి. విశాల్ నిర్మాతల మండిలలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడనీ.. ఇన్నేళ్లలో పైరసీని అరికట్టలేకపోయాడనీ.. (ఇది అతని హామీ).. చెబుతున్నారు. ఇక అసలే నిర్మాతలు సక్సెస్ రేట్ తక్కువగా ఉందని ఫీలవుతోంటే ఆ మధ్య ఒక్కో టికెట్ పై వచ్చే డబ్బుల్లో రూపాయిని రైతుల కోసం ఇవ్వాలన్నాడు. దానిపై అప్పట్లో బాగా విమర్శలు కూడా వచ్చాయి. మొత్తంగా వెనక్కి తగ్గాడు. అలాగే నడిగర్ సంఘం బిల్డింగ్ కూడా ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఇవన్నీ కాకుండా ఈ నెల 21న తొమ్మిది సినిమాలు విడుదలవుతున్నాయి. ఇన్ని సినిమాలు ఒకే రోజు విడుదల చేయడానికి పర్మిషన్ ఎలా ఇచ్చారు అనేది వారి వాదన.
మొత్తంగా విశాల్ ను పోలీస్ లు అరెస్ట్ చేయడం మాత్రం కరెక్ట్ గా లేదు. ఎందుకంటే ఇవన్నీ వారి ఇంటర్నల్ సమస్యలు. వాళ్లు పరిష్కరించుకోగలరు. కానీ ఓ అఫీషియల్ బిల్డింగ్ కు అనఫీషియల్ వ్యక్తులు తాళం వేసి తీసుకువచ్చినప్పుడే వాళ్లు సంబంధిత వ్యక్తులకు సమాచారం ఇవ్వాలి. లేదంటే వారినీ విచారించాలి. కానీ ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదనే విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయం విశాల్ కూడా ట్వీట్ చేశాడు. న్యాయం, దేవుడు నా వైపు ఉన్నారు. నా ఫైట్ కంటిన్యూ చేస్తా అంటున్నాడు. మరి ఈ వ్యవహారంపై తమిళ సినీ పెద్దలు రాధారవి, కమల్, రజినీకాంత్, విజయ్ వంటివారు ఎలా స్పందిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here