‘పేటా’ నిర్మాత గలాటా

0
394
అంటే అన్నాం అంటారు కానీ.. తమిళోళ్లు పండగల టైమ్ లో మన సినిమాలు విడుదల చేస్తారా..? సెయ్యరుగా.. మరి మనం ఎందుకు ఆళ్ల సినిమాలకు థియేటర్స్ ఇవ్వాలి.. ఇదీ ప్రస్తుతం పేటా ప్రొడ్యూసర్ థియేటర్ మాఫియా గురించి ఫైర్ అయిన తర్వాత కామన్ ఆడియన్ నుంచి కూడా వినిపిస్తోన్న మాటలు. ఆయన రజినీకాంత్ అయితే కావొచ్చు.. తెలుగు సినిమా అయితే చేయలేదుగా.. డబ్బింగేగా..? ఇది మరో వెర్షన్.. థియేటర్స్ మాఫియా అనేది టాలీవుడ్ లో వరకట్నం సమస్య లాంటిదని అందరికీ తెలుసు. దాన్ని ఆపలేము.. ఇవ్వకుండా ఉండలేము అన్నట్టుగా.. థియేటర్స్ ను పూర్తిగా వదులుకోలేరు.. అలాగని అంటిపెట్టుకోలేరు.. ఎవరైనా థియేటర్ ఉంటే ఖాళీగా ఎందుకుంచుకుంటారు. ఏదో ఒక సినిమా వేస్తారు కదా.. ఆ వేసే సినిమా ఏది వేయాలో థియేటర్ ఉన్నోడి నిర్ణయం. దాన్ని కాదనే హక్కు టెక్నికల్ గా ఎవరికీ లేదు.. నైతికత ప్రశ్నే ఇండస్ట్రీలో లేదు. ఇంకేంటీ పేటా ప్రొడ్యూసర్ చేసే గలాటా.. ?ఇది ఇంకో వెర్షన్..
యస్.. లేటెస్ట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ పేటా సినిమాను అశోక్, ప్రసన్న అనే ఇద్దరు నిర్మాతలు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెల 10న సినిమా విడుదల. కానీ వారికి థియేటర్స్ కావాల్సినన్ని దొరకలేదు. దీంతో థియేటర్స్ ను గుప్పిట్లో పెట్టుకున్న దిల్ రాజు, యూవీ క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ వంటి వారిని కాల్చి పారేయాలి అని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడాయన.
నిజానికి ఇప్పుడు రజినీకాంత్ సినిమాలు ఎగబడి చూసే జనరేషన్ ఉందా..? అంటే ఖచ్చితంగా లేదు. ఈ పదేళ్లలో ఆయన్నుంచి ఆయన రేంజ్ సాలిడ్ హిట్టే రాలేదు. మరి ఈ తరం ఆయన సినిమాలు ఎందుకు చూస్తుంది. ఇక ఆ తరం మనుషులు థియేటర్స్ కు రావడం ఎప్పుడో తగ్గించేశారు. అలాంటి సందర్భాల్లో పండగ మూమెంట్ లో ఖాళీగా ఉండే థియేటర్స్ ను ఎవరు కోరుకుంటారు. పైగా తెలుగులో విడుదలవుతోన్న సినిమాలేమీ చిన్నవి కావు. అందరూ పెద్ద స్టార్సే. వాళ్ల సినిమాలు కాదని రజినీకాంత్ పేటాకు థియేటర్స్ ఇవ్వలేరు కదా.. (ఇవ్వాల్సిన అవసరం లేదని వాళ్లంటన్నారు. అది వేరే విషయం)..
లింగా నుంచి రజినీకాంత్ అన్నీ ఫ్లాపులే ఇస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన 2.0 కూడా మనాళ్లను ఏమాత్రం ఆకట్టుకోలేదు. దీంతో ఆ సినిమా పైన ఎవరికీ ఆసక్తి కూడా లేదు. ఏ కామన్ ఆడియన్ ను పండగకు ఏ సినిమా చూస్తారు అని అడిగినా.. ఈ మధ్య కొన్ని వెబ్ సైట్స్ లో దీనికి సంబంధించి ఆన్ లైన్ పోలింగ్ కూడా జరిగింది. అందులో పేటా అట్టడుగు స్థానంలో ఉంది. దీన్ని బట్టి రజినీకాంత్ సినిమాను ఎవరూ పట్టించుకోవడం లేదనే కదా అర్థం. అలాంటి సినిమాను ఆడియన్ పై రుద్దే ప్రయత్నం పండగ పూట చేస్తున్నాడు సదరు నిర్మాత. అయిన నిర్మాత అటెన్షన్ కోసం అలాంటి కమెంట్స్ చేశాడా అని కూడా అంటున్నారు చాలామంది. ఏదేమైనా పేటాలో కూడా ఫ్లాప్ కళలు స్పష్టంగా కనిపిస్తున్నాయనేది ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోన్న మాట. ఇక్కడే కాదు.. తమిళ్ లో కూడా పేటా కంటే అజిత్ విశ్వాసం పైనే ఆడియన్స్ ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు. అదీ ఇప్పుడు రజినీ స్థాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here