‘పేటా’ నిర్మాత సెల్ఫ్ గోల్

0
403
పేటా.. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా. మరికొన్ని గంటల్లో విడుదల కాబోతోన్న ఈ సినిమాకు సంబంధించి నిర్మాత థియేటర్స్ విషయంలో చేసిన గలాటా ఫైనల్ గా అతనికే లాస్ అయింది. ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేసుకున్న సినిమాకు పోటీగా వచ్చాడీ నిర్మాత. కానీ థియేటర్స్ చాలినన్ని లేవని ఆ మధ్య ప్రెస్ మీట్ పెట్టి కాస్త అభ్యంతరకరమైన భాషలో మాట్లాడాడు.  ఇప్పటి వరకూ థియేటర్స్ మాఫియాపై చాలామంది కమెంట్స్ చేశారు. కానీ ఈ నిర్మాతలా ఎవరూ మాట్లాడలేదు. దీంతో ఇండస్ట్రీ నుంచి కూడా పర్టిక్యులర్ గా అతను ఎవరినైతే అన్నాడో.. ఏ కారణంతో అయితే అన్నాడో వాళ్లే సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అవడమే కాదు.. సరికొత్త నిర్ణయాలు తీసుకున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఈ సినిమాకు భారీ ఎఫెక్ట్ పడినట్టైంది.
నిర్మాత అనవసరంగా కెలుక్కోవడం వల్ల ఇప్పుడీ సినిమాకు ముందు అనుకున్న థియేటర్స్ కూడా లేకుండా పోవడం విశేషం. హైదరాబాద్ లో కేవలం రెండు థియేటర్స్ లోనే రిలీజ్ అవుతోంది. ఫస్ట్ డే హైదరాబాద్ లో కాస్త ఎక్కువ థియేటర్స్ ఉన్నా.. నెక్ట్స్ డేకు పేటాకు మిగిలేది కేవలం రెండు థియేటర్స్ మాత్రమే. అవి కూడా పెద్దగా ప్రాధాన్యం లేనివే కావడం విశేషం. దీంతో ఇప్పుడు దిల్ రాజు వంటి వారు చెప్పినట్టు వీళ్లు నిజంగానే ఈ నెల 18నే విడుదల చేసుకుని ఉండాల్సింది అనిపిస్తోంది. అయితే థియేటర్స్ లిస్ట్ కాస్త ఎక్కువే కనిపిస్తున్నా అవన్నీ ఒక్క రోజుకు మాత్రమే పరిమితం కావడం విశేషం. మొత్తంగా పేటా నిర్మాత అనవసరంగా నోరు పారేసుకుని ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here