బాల‌య్య కోసం స్టోరీ సిద్ధం చేసిన ‘అ’ డైర‌క్ట‌ర్

0
1136
జూన్ 28న విడుద‌ల‌ అవుతున్న సినిమాల్లో ‘కల్కి’ మీద కాస్త ఎక్కువ హైప్ ఉంది. ట్రైలర్స్ ని ఆకట్టుకునేలా కట్ చేయడంతో పాటు మంచి క్రైమ్ థ్రిల్లర్ ని రూపొందించిన ఫీలింగ్ వాటి ద్వారా కలిగించడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. తన మొదటి సినిమా అ! తోనే అందరితో ఆహా అనిపించుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ టేకింగ్ గురించే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. దీని ప్రమోషన్ లో భాగంగా ప్రశాంత్ బాలయ్య కోసం తన వద్ద ఓ అద్భుతమైన సబ్జెక్టు రెడీగా ఉందని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
గత కొంతకాలంగా అభిమానులు దర్శకుల వల్ల ఆయన మూసలో పడిపోయి రొటీన్ సినిమాలు చేశారని తనకు అవకాశం ఇస్తే కనివిని ఎరుగని రీతిలో ఆయన క్యాలిబర్ ని పూర్తిగా వాడుకునేలా మూవీ తీస్తానని హామీ ఇస్తున్నాడు. డిఫరెంట్ మేకింగ్ స్టైల్ ఉన్న ప్రశాంత్ వర్మ బాలయ్య కాంబినేషన్ అంటే ఊహాకందనిదే. ఒకవేళ నిజమైనా మంచిదే. ఎలాగూ బాలకృష్ణకు ఈ మధ్య ఏదీ పెద్దగా వర్క్ అవుట్ కావడం లేదు. ప్రశాంత్ లాంటి కుర్రాడికి ఛాన్స్ ఇస్తే నిజంగా ఏదైనా మాయ చేయొచ్చుగా. ప్రశాంత్ వర్మ బాలయ్యను ఒప్పిస్తే ఇది ఖ‌చ్చితంగా వెరైటీ క్రేజీ కాంబినేషన్ అవుతుంది. ఒకవేళ కల్కి కనక అంచనాలు నిలబెట్టుకుని సూపర్ హిట్ అయితే బాలయ్యను రీచ్ కావొచ్చు. ఏ మాత్రం అటు ఇటు అయినా ఆయన దృష్టిలో పడటం కష్టమే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here