‘పంతం’ మూవీ రివ్యూ

0
335

గ‌త కొన్నేళ్లుగా వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌తమ‌వుతున్న గోపీచంద్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న టైమ్ లో త‌న 25వ సినిమాగా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా పంతం అనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. కొత్త ద‌ర్శ‌కుడితో క‌లిసి గోపీచంద్ చేసిన ప్ర‌య‌త్నం ఈసారైనా త‌న‌ను స‌రైన గాడిలో ప‌డేలా చేస్తుందా లేదా అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థః

ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్ట‌ర్ జ‌యేంద్ర (సంప‌త్‌), హెల్త్ మినిస్ట‌ర్ (జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి). వారిద్ద‌రి డ‌బ్బును ప్లాన్ వేసి కొట్టేస్తుంటాడు ఓ వ్య‌క్తి (గోపీచంద్‌). ఓసారి మినిస్ట‌ర్ కాన్వాయ్ నుంచి, మ‌రోసారి రైలు భోగీ నుంచి, మ‌రోసారి మినిస్ట‌ర్ హ‌వాలా చేసే డ‌బ్బు, ఇంకోసారి మినిస్ట‌ర్ గ‌ర్ల్ ఫ్రెండ్ ద‌గ్గ‌ర దాచిన డ‌బ్బు … ఇలా చాలా విధాలుగా కోట్ల రూపాయాల‌ను కొట్టేస్తుంటాడు. త‌మ డ‌బ్బును కొట్టేసిన వ్య‌క్తి ఎవ‌రో ఒకానొక స‌మ‌యంలో జ‌యేంద్ర‌కు తెలుస్తుంది. అయితే ఆ వ్య‌క్తి మామూలు వాడు కాద‌నీ, ప్ర‌పంచంలో టాప్ టెన్ రిచెస్ట్ పీపుల్ లో ఒక‌రైన సురానా ఇండ‌స్ట్రీ అధినేత కుమారుడ‌ని అర్థ‌మ‌వుతుంది. అంత డ‌బ్బున్న వ్య‌క్తి కుమారుడికి ఇలా హోమ్ మినిస్ట‌ర్ డ‌బ్బును దొంగ‌లించాల్సిన అవ‌స‌రం ఏంటి? అత‌నికి అనాథాశ్ర‌మానికి లింకేంటి? అత‌ను కొట్టేసిన డ‌బ్బును ఏం చేశాడు? డొనేష‌న్లు కూడా అవ‌స‌రం లేనంత‌గా త‌రాలు తినేలా నిధులున్న అనాథాశ్ర‌మానికి అత‌ని వ‌ల్ల క‌లిగిన ఉప‌యోగం ఏంటి? ఆ అనాథ ఆశ్ర‌మం అత‌నికి ఎలా ఉప‌యోగ‌ప‌డింది వంటివ‌న్నీ సినిమాలోనే చూడాలి.

న‌టీన‌టుల ప్ర‌తిభః
మాస్ మ‌రియు యాక్ష‌న్ రోల్ లో త‌న‌కు అస‌లు తిరుగేలేద‌ని గోపీచంద్ మ‌రోసారి త‌న యాక్టింగ్ తో ప్రూవ్ చేసుకున్నాడు. యాక్ష‌న్ సీన్స్ లో మంచి ఈజ్ చూపించి, రాబిన్ హుడ్ లాంటి క్యారెక్ట‌ర్ లో చాలా పర్ఫెక్ట్ గా చేశాడు. అటు కామెడీ టైమింగ్ లోనూ, న‌ట‌నా ప్రాధాన్యం ఉన్న స‌న్నివేశాల్లోనూ గోపీచంద్ న‌ట‌న చాలా బాగుంటుంది. మెహరీన్ కేవ‌లం పాట‌ల‌కే ప‌రిమిత‌మైంది. సంప‌త్ ఎప్ప‌టిలాగానే త‌న‌దైన స్టైల్ లో మెప్పించాడు. మిగిలిన వారిలో షియాజీ షిండే, ముకేష్ రుషి, త‌నికెళ్ల భ‌రణి, పృథ్వీ త‌మ త‌మ ప‌రిధుల్లో బాగా చేశారు.

సాంకేతిక నిపుణులుః
ద‌ర్శ‌కుడు చ‌క్ర‌వ‌ర్తి తొలి సినిమాకు కొత్త సబ్జెక్ట్ కాకపోయినా దానికి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి కాస్త కొత్త‌గా చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించాడు. కానీ త‌నుచెప్పాల‌నుకున్న మెసేజ్ మాత్రం బావుంది. ముఖ్యంగా క్లైమాక్స్ చిత్రీక‌రించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. సంభాష‌ణ‌లు బావున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో కోర్టు సీన్స్ లో సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటాయి. ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్ర‌ఫీ చాలా రిచ్‌గా ఉంది. ప్ర‌తి సీన్ ను చాలా రిచ్ గా తెర‌పై ఆవిష్క‌రించారు. గోపీ సుంద‌ర్ నేప‌థ్య సంగీతం ప‌రావాలేదు. పాట‌లేమీ పెద్ద‌గా బాలేవు. ఆర్ట్ డైరెక్ట‌ర్ ప్ర‌కాశ్ ప‌నితీరు మెచ్చుకోలుగా ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః
గోపీచంద్ న‌ట‌న‌
డైలాగులు
సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్ః
రొటీన్ స్టోరీ
ఎంట‌ర్‌టైన్‌మెంట్ మిస్ అవ‌డం
పాట‌లు

పంచ్‌లైన్ః పంతంగా నిల‌బ‌డుతుందా..?
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 35

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here