ఫ్రస్ట్రేషన్ లో బాలయ్య.. మహానాయకుడు పోస్ట్ పోన్..?

0
203

బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘‘ఎన్టీఆర్ కథానాయకుడు’’కు పాజిటివ్ టాక్ వచ్చినా అనూహ్యంగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణమైన పర్ఫార్మెన్స్ చేస్తోంది. ఇది ఎవరూ ఊహించనిది. మరీ ఇంత దారుణమైన కలెక్షన్స్ .. అదీ పాజిటివ్ టాక్ ఉన్న సినిమాకు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితి చిన్న సినిమాలకు ఉంటుంది. కానీ బాలకృష్ణ లాంటి టాప్ హీరోకు జరగడం.. అది కూడా తన తండ్రి బయోపిక్ కు జరగడం అతన్ని చాలా బాధిస్తోందట. పైకి చెప్పుకోవడం లేదు కానీ బాలయ్య ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో చాలా ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నట్టు సమాచారం.

బాలయ్య ఫ్రస్ట్రేషన్ కు కారణం లేకపోలేదు. ఒక నటుడుగానే కాదు.. తన తండ్రి సినిమా పరువు పోయిందనే బాధతో పాటు.. ఈ సినిమాకు నిర్మాత కూడా ఆయనే కాబట్టే ఇంత బాధ. అసలు ఈ సినిమా ఎందుకు కలెక్షన్స్ సాధించలేకపోతోంది అనేది ట్రేడ్ కు కూడా అంతబట్టడం లేదు అనుకుంటున్నారు. కానీ సినిమా మరీ ఫ్లాట్ గా ఉండటం.. సినిమా అంతా అప్స్ తప్ప డౌన్స్ లేకపోవడం.. కథలో ఎలాంటి కాన్ ఫ్లిక్ట్ లేకపోవడంతో పాటు.. సినిమా మొదలైన దగ్గర్నుంచీ ఎన్టీఆర్ ను మానవాతీతుడు అన్న రేంజ్ లో ప్రెజెంట్ చేయడం నేటి తరానికే కాదు.. నాటి తరానికి.. ముఖ్యంగా సినిమా లవర్స్ కు అస్సలు నచ్చలేదన్నది వాస్తవం. ఈ విషయం ఎవరూ ఓపెన్ గా చెప్పడం లేదు కానీ.. ఈ కారణంగానే సినిమాకు కలెక్షన్స్ నిల్ అవుతున్నాయనేది నిజం.
మొత్తంగా ‘‘ఎన్టీఆర్ కథానాయకుడు’’ బాలయ్య కథనాయకుడుగానే కాదు.. నిర్మాతగానూ లాస్ అయ్యాడు.. అంటే డబుల్ లాస్ అన్నమాట. ఈ లాస్ లో కొత్తగా ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదే ఈ మూవీకి రెండో భాగంగా ఉన్న ‘‘ఎన్టీఆర్ మహానాయకుడు’’ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఉన్నారట. అంటే పొలిటికల్ గా ఆయన ఫేస్ చేసిన సంఘటనల్లో ఈ సారైన కాస్త ‘నిజాలు’ చూపించే ప్రయత్నం చేస్తారేమో. పోస్ట్ పోన్ వెనక కారణాలు కూడా చెబుతున్నారు. కొన్ని సీన్స్ ను రీ షూట్ చేయాలనుకుంటున్నారట. ఈ సారైనా ఇలాంటి ‘‘నిజాలు లేవు’’ అనే విమర్శలు లేకుండా చూడాలనుకుంటున్నట్టు టాక్. ఏదేమైనా బాలయ్యలో డబుల్ లాస్ ఫ్రస్ట్రేషన్ మాత్రం బాగా కనిపిస్తోందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here