బిగ్ బాస్ కండీషన్స్ కు డైలమాలో ఎన్టీఆర్…?

0
1377
బిగ్ బాస్ కు ఎన్టీఆర్ కు కండీషన్స్ పెట్టేంత సీన్ ఉందా అనుకుంటున్నారు కదూ…? నిజమే..కానీ బిగ్ బాస్ అంటే మీరు అనుకుంటోన్న స్టార్ మా బిగ్ బాస్ కాదు.. అదే టైమ్ ఈ కండీషన్స్ కూడా ఆ బిగ్ బాస్ గురించే. కన్ఫ్యూజ్ అవుతున్నారా..? వెరీ సింపుల్.. ఇక్కడ ఎన్టీఆర్ బిగ్ బాస్ అంటే రాజమౌళి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు కాబట్టి.. ఆ సినిమా పూర్తయ్యే వరకూ రాజమౌళే కదా ఎన్టీఆర్ కు బిగ్ బాస్.. అయితే ఇటు స్టార్ మా బిగ్ బాస్ థర్డ్ సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్నాడనే వార్తలు గట్టిగా వస్తున్నాయి. కానీ అందుకు ఇంకా రాజమౌళి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అలాగని రెడ్ సిగ్నల్ వేస్తాడని కూడా చెప్పలేం. ఎందుకంటే ఎన్టీఆర్ కు వచ్చిన డీల్ అలాంటిది మరి.. అందుకే జక్కన్న కొన్ని కండీషన్స్ పెట్టాలనుకుంటున్నాడట.
స్టార్ మా నుంచి ఈ సారి హోస్ట్ చేయడానికి ఎన్టీఆర్ కు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది.. దాదాపు 20 కోట్ల వరకూ ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. మరి ఇంత అమౌంట్.. అది కూడా కేవలం వంద రోజులకే వస్తుంది. పైగా డెయిలీ పని చేయాల్సిన పనిలేదు. వీకెండ్స్ లో మాత్రమే.. అదీ ఓ మూణ్నాలుగు గంటలు మాత్రమే.అందుకే ఎన్టీఆర్ కు అంత అమౌంట్ రాకుండా తనెందుకు అడ్డుకోవాలనే ఆలోచనలో ఉన్న రాజమౌళి ఆది వారం మాత్రమే అనుమతిస్తానని చెప్పాడట. ఆ రోజు షూటింగ్ పూర్తి చేసుకోవాలని కూడా అన్నాడట. ఇందుకు స్టా మా టీమ్ ఓకే చెప్పినా.. రాజమౌళి ఇంకా పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని టాక్.. ఇలా తన హీరో సినిమాలో కనిపించాల్సిన లుక్ తో ప్రతి వారం టివిలో కనిపిస్తే తెరపై కిక్ రాదనే భావనలో ఉన్నాడట రాజమౌళి. మరి ఇందుకు సంబంధించి మేకప్ పరంగా ఇంకేమైనా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారా అనేది చూడాలి. కాకపోతే రాజమౌళి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయం అనేదీ వినిపిస్తోంది.మరి ఎప్పుడు అనేదే తేలాలింక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here