మెగా సాయం చేయ‌నున్న ఎన్టీఆర్…!

0
2775
సాయితేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ సినిమా నిర్మితమైంది. కల్యాణి ప్రియదర్శన్ .. నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ లోగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడానికి మైత్రీ మూవీ మేకర్స్ వారు సన్నాహాలు చేస్తున్నారు.ఇప్పటికే మార్కెట్ పరంగా బాగా డ్యామేజ్ లో ఉన్న తేజుకి ఇది భారీ హిట్ కావాల్సిన అవసరం చాలా ఉంది.అందుకే ప్రమోషన్ విషయంలో మైత్రి సంస్థ ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. త్వరలో జరపబోయే ప్రీ రిలీజ్ ని సైతం భారీ ఎత్తున సం థింగ్ స్పెషల్ అనేలా ప్లాన్ చేస్తున్నారట.
‘చిత్రలహరి’ ప్రమోషన్ విషయంలో మైత్రి సంస్థ ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. త్వరలో జరపబోయే ప్రీ రిలీజ్ ని సైతం భారీ ఎత్తున సం థింగ్ స్పెషల్ అనేలా ప్లాన్ చేస్తున్నారట. సాధారణంగా ఏ మెగా హీరో సినిమా ఫంక్షన్ అయినా చిరు లేదా ఆ ఫామిలీలో హీరోలు ఎవరో ఒకరు గెస్ట్ గా రావడం ఆనవాయితీ .కానీ ఈ సారి చిత్రలహరికి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. జనసేన పార్టీ రాజకీయ క్షేత్రంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మెగా హీరోలు ఏ పబ్లిక్ ఫంక్షన్ లో కనిపించినా ఆ నినాదాలతోనే ప్రాంగణాలు హోరెత్తే అవకాశాలు ఉన్నాయి. అలాంటి ఇబ్బంది రాకుండా తారక్ ను తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.

‘జనతా గ్యారేజ్’ సమయం నుంచి మైత్రీ మూవీ మేకర్స్ వారికి ఎన్టీఆర్ తో మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన వాళ్ల ఆహ్వానం మేరకు ఎన్టీఆర్ రానున్నాడని అంటున్నారు. మ‌రో వైపు దీని వెనుక చరణ్ సాయం కూడా ఉందని అభిమానులు అనుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఉన్నప్పుడు తేజు కోసం అతిధిగా వెళ్ళమని చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కు స్పెషల్ రిక్వెస్ట్ పెట్టాడట. తామిద్దరం ఎంతో గొప్ప స్నేహితులమో మీడియా సాక్షిగా చెప్పిన తారక్ ఇప్పుడు ఈ మాటను అంత ఈజీగా కాదనగలడా. ఒకవేళ నిజమైతే చిత్రలహరి వైపు యంగ్ టైగర్ ఫాన్స్ కూడా ఓ లుక్ వేసే ఛాన్స్ ఉంది