మ‌రొక‌సారి గొంతు స‌వ‌రించుకోనున్న ఎన్టీఆర్..?

0
166

హీరోలంటే కేవ‌లం న‌టించ‌డ‌మే కాదు, బ‌య‌ట యాంక‌రింగ్ లు చేయ‌డం, పాట‌లు పాడ‌టం, ఫైట్స్ నేర్పించ‌డం, నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌డం ఇలా అన్నీ చేయాలి అని ఆల్రెడీ చాలా మంది చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వ‌ర‌కు అంద‌రూ నిరూపించారు. ఈ త‌రుణంలోనే ఎన్టీఆర్ ఇప్ప‌టికే త‌న గొంతు ప‌లుమార్లు స‌వ‌రించుకుని త‌న చిత్రాల‌కే కాకుండా, క‌న్న‌డ సూప‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సినిమా కోసం కూడా పాట పాడిన విష‌యం విదిత‌మే. అయితే ఇప్పుడు ఈ విష‌య‌మెందుకా అనుకుంటున్నారా..? ఆ విష‌యంలోకి వెళ్దాం.

ఎన్టీఆర్ హీరోగా, త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కత్వంలో హారికా హాసినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో ‘అర‌వింద స‌మేత వీర రాఘ‌వ’ అనే సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే.ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. అయితే అర‌వింద స‌మేత‌లో ఎన్టీఆర్ తో ఒక పాట పాడించాల‌ని థ‌మ‌న్ గ‌ట్టిగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ట‌. ఆల్రెడీ తార‌క్ తో క‌లిసి రాకాసి.. రాకాసి అంటూ ర‌భ‌స సినిమాలో పాటకు ట్యూన్ ఇచ్చిన థ‌మ‌న్, మ‌రోసారి తార‌క్ సినిమాలోనే పాట పాడించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ట‌. దానికి తోడు త్రివిక్ర‌మ్ కూడా స్టార్ హీరోతో సినిమా అంటే ముందు నుంచే బ‌జ్ క్రియేట్ చేయ‌డానికి చేయ‌ని ప్ర‌య‌త్నం ఉండదు. ఈ సినిమాకు కూడా అలాగే ఎన్టీఆర్ తో పాట పాడించి ఆల్రెడీ ఉన్న హైప్ ను రెట్టింపు చేయాల‌ని ట్రై చేస్తున్నాడట‌. పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాను అక్టోబ‌ర్ 11న రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here