నితిన్ సర్ ప్రైజింగ్ డెసిషన్

0
2752
ఇష్క్ తో ఫామ్ లోకి వచ్చిన నితిన్ మళ్లీ కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయాడు. అ ఆ తర్వాత అతని రేంజ్ మారుతుంది అనుకున్నారంతా.. బట్.. ఎక్కడో దెబ్బయిపోయాడు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ మారుతోంది. కొత్త తరం దర్శకుడు మంచి కథలతో వస్తున్నాడు. లేదంటే కథనాలతో ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాస్త గ్యాప్ తీసుకున్న నితిన్ వరుసగా సినిమాలు అనౌన్స్ చేయబోతున్నాడు. ఈ మేరకు గతంలోనే కాస్త వెయిట్ చేయండి అందరికీ సంతృప్తినిచ్చే విషయం చెబుతా అంటూ తన ఫ్యాన్స్ కు ట్విట్టర్ లో చెప్పాడు. ఈ మేరకు అతని నుంచి వస్తోన్న ఓ కొత్త వార్త ఆశ్చర్యపరుస్తోంది.
ప్రస్తుతం నితిన్ సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సినిమాక సైన్ చేసి ఉన్నాడు. ఛలోతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకుడు. రష్మిక మందాన్న హీరోయిన్ గా నటించబోతోన్న ఈ మూవీకి ‘భీష్మ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు కూడా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ మూవీ వచ్చే ఉగాది నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. ఇక ఈ టైమ్ లో నితిన్ నుంచి మరో సినిమా అనౌన్స్ కాబోతోంది.
గతంలో రైడ్, ఒక ఊరిలో, వీర వంటి సినిమాలతో దర్శకుడుగా లక్ చెక్ చేసుకున్న రమేష్ వర్మ డైరెక్షన్ లో సినిమాకు ఓకే చెప్పాడు. ఇది ఓ ప్యూర్ లవ్ స్టోరీ అట. ప్రస్తుతం రమేష్ వర్మ బెల్లంకొండ శ్రీనివాస్ తో తమిళంలో సూపర్ హిట్ అయిన రాక్షసన్ ను రీమేక్ చేస్తున్నాడు. నిజానికి ఈ మూవీలో ముందుగా నితినే నటిస్తాడనే వార్తలు వచ్చాయి. బట్ అతను తప్పుకున్నాడు. మొత్తంగా ఇప్పుడు అదే దర్శకుడు చెప్పిన కథకు నితిన్ ఓకే చెప్పి ఆశ్చర్య పరిచాడు. ఆశ్చర్యం ఎందుకంటే.. ఈ ప్రేమకథను సదరు దర్శకుడు ఇప్పటికే చాలామందికి చెప్పాడట. కానీ ఎవరూ ఓకే చెప్పలేదు. దీంతో ఇక రమేష్ వర్మ పని అయిపోయింది అనుకున్నారంతా. బట్ అనుకోకుండా రాక్షసన్ రీమేక్ వచ్చింది.. దానికి డబుల్ బోనస్ గా నితిన్ కూడా ఓకే చెప్పాడు. మరి ఈ కథ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఇక ఈ నెల 30న నితిన్ బర్త్ డే. ఆ రోజున ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అనౌన్స్ మెంట్ రావచ్చు.