”Ningilona Paalapuntha” Connects to Audience’s Soul

0
814
తెలుగు ప్రేక్ష‌కుల గుండెల‌కు హ‌త్తుకునే ప్రేమ క‌థ‌తో ‘దొర‌సాని’ ముస్తాబ‌వుతోంది. యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజ‌శేఖ‌ర్ చిన్న కూతురు శివాత్మిక‌, టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ లు ఈ సినిమాతో న‌టీన‌టులుగా తెరంగేట్రం చేస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో మ‌ధుర ఎంట‌ర్‌టైన్‌మెంట్, బిగ్ బిన్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో కేవీఆర్ మ‌హేంద్ర ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ తోనే ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్న దొర‌సాని టీమ్ తాజాగా ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియోతో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించారు.
”నింగిలోని పాల‌పుంత న‌వ్వులొంపెనే..” అంటూ సాగే ఈ పాట కు గోరేటి వెంక‌న్నసాహిత్యాన్ని అందించారు. ”కంచెలడ్డున్నా కోయిల కూత‌నాపునా.. క‌దిలే సుడులున్నా సేప ఈతనాపునా.. అంద‌కున్న ఆకాశం ప‌క్షి కాంక్ష ఆగునా, వంతెనేది లేకున్నా మ‌న‌సు ప‌రుగునాపునా? అంతఃపుర కొల‌నులో విరిసిన ఆ క‌లువ‌ను ఏ మ‌బ్బుల‌డ్డుకున్నా వెన్నెలాగిపోవునా..?” అని త‌న క‌లంతో దొర‌సాని కోసం త‌న ప్రేమికుడు అనుభ‌వించే భావ‌న‌ను గోరేటి వెంక‌న్నఎంతో అద్భుతంగా చెప్ప‌గా, దాన్ని ప్ర‌శాంత్ ఆర్ విహారి సంగీతం, అనురాగ్ కుల‌క‌ర్ణి గానం మ‌రో స్థాయికి తీసుకెళ్లేలా చేసి, ప్రేక్ష‌కుల్ని పాట‌తో మ‌రోసారి క‌ట్టిప‌డేసేలా చేసింది దొర‌సాని టీమ్. ఇంకెందుకు ఆల‌స్యం మీరు కూడా ఈ పాట మీద ఓ లుక్కేయండి..

Listen the song Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here