నాగార్జునగారూ… అఖిల్ కు ఆ ఇద్దరూ కరెక్ట్ కాదు సార్..

0
1644

అక్కినేని నాగార్జున.. తండ్రి నాగేశ్వరరావు వారసుడుగా ఆయన స్థానాన్ని హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా మాగ్జిమం నిలబెట్టాడు. నాటి టాప్ ఫోర్ లో ఉంటూ తనకంటూ తిరుగులేని స్టార్డమ్ అయితే తెచ్చుకున్నాడు. కానీ ఆయన తనయులు ఆ పనిలో సక్సెస్ కాలేకపోతున్నారు. అంటే నాగ్ లా వాళ్లు స్టార్ రేస్ లోకి రాలేకపోతున్నారు. నాగచైతన్య కొంత మెరిపించినా ఎప్పటికీ టాప్ లీగ్ లోకి రాలేడని తేలిపోయింది. ఇక నాగ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న అఖిల్ పరిస్థితి నానాటికి తగ్గిపోతోందే తప్ప హిట్టవడం లేదు. లేటెస్ట్ గా అఖిల్ చేసిన ‘మిస్టర్ మజ్ను’ కూడా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావాన్ని చూపించలేపోయింది. దీంతో నాగ్ కు మరోసారి నిరాశ తప్పలేదు. ఈ నేపథ్యంలో అఖిల్ నాలుగో సినిమా విషయంలో ఇద్దరు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ సిట్యుయేషన్ ను బట్టి చూస్తే ఆ ఇద్దరూ ఇప్పుడు అఖిల్ కు అస్సలు కరెక్ట్ కాదునేది నిజం.

వరుస డిజాస్టర్స్ తో అసలు సోదిలోనే లేకుండా పోయిన శ్రీను వైట్ల అఖిల్ తో తర్వాతి సినిమా చేస్తున్నాడు అనేది కొత్త రూమర్. కానీ ఈ మాట నిజం కాకూడదని ఎంతమంది అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారనేది నాగ్ కు తెలియకపోవచ్చు. కానీ శ్రీను వైట్ల ఏ మాత్రం కొత్తదనం చూపలేని దర్శకుడు అనేది.. అతను ‘డూ ఆర్ డై’ సిట్యుయేషన్ లో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ ఓ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. పోనీ ఇప్పుడతని టైప్ రెగ్యులర్ ఎంటర్టైనర్ చేద్దామంటే టాలీవుడ్ లో ఆ కథలకు కాలం చెల్లింది. అందువల్ల అఖిల్ విత్ శ్రీను వైట్ల అనేది ఎలా చూసినా రాంగ్ డెసిషన్ అవుతుంది.. అతను ఎంత మంచి కథ తెచ్చినా సరే.. ఇప్పుడసలు ప్రేక్షకులు శ్రీను నమ్మే పరిస్థితి లేదు. అదే పెద్ద మైనస్ అవుతుందీ కాంబినేషన్ కు.

ఇక అఖిల్ తో చేస్తోన్న దర్శకుడు అంటూ వినిపిస్తోన్న పేరు క్రిష్. క్రిష్ మంచి దర్శకుడే. డౌట్ లేదు. కానీ అతని సినిమాలకు కమర్షియల్ గా సత్తా చాటేంత సీన్ లేదని ప్రతి సినిమాకూ అర్థమౌతోంది. లేటెస్ట్ గా వచ్చిన ‘‘ఎన్టీఆర్ కథానాయకుడు’’ ఏకంగా 40 కోట్ల వరకూ లాస్ తెచ్చింది. అంతకు ముందు చేసిన గౌతమీపుత్రశాతకర్ణి ఓకే అనిపించినా.. దానికి ముందు చేసిన కంచెకు బావుందన్న టాక్ వచ్చినా డబ్బులు రాలేదు. అలాగే వేదం, క్రిష్ణం వందే జగద్గురుమ్, గమ్యం పరిస్థితీ ఇంతే. సో.. ఇప్పుడు అఖిల్ కు కావాల్సింది ఓ సూపర్ కమర్షియల్ హిట్ కానీ మంచి సినిమా ఎంత మాత్రం కాదు. ఈ రెండోది క్రిష్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వలేడనేది బాక్సాఫీస్ ఎరిగిన సత్యం. అందువల్ల నాగార్జున గారూ.. ఇప్పుడు అఖిల్ నిలబడాలంటే ఈ ఇద్దరు దర్శకులూ ఎంతమాత్రం కరెక్ట్ కాదు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here