కింగ్ అక్కినేని నాగార్జున ‘మన్మధుడు 2 ‘ షూటింగ్ ప్రారంభం

0
2840
కింగ్ నాగార్జున హీరోగా మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ ల పై అక్కినేని నాగార్జున, పి.కిరణ్ నిర్మాతలుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘మన్మధుడు 2 ‘ షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. సీనియర్ రైటర్ సత్యానంద్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కి స్క్రిప్ట్ ని అందించగా, అమల అక్కినేని ఫస్ట్ క్లాప్ ఇచ్చారు. యువ సామ్రాట్ నాగ చైతన్య కెమెరా స్విచాన్ చేయగా మొదటి షాట్ ని దేవుని పటాలపై చిత్రీకరించారు. సుమంత్, సుశాంత్, నాగ సుశీల, యార్లగడ్డ సురేంద్ర ఇంకా అక్కినేని కుటుంబసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారం రోజులు హైదరాబాద్ షెడ్యూల్ జరుపుకున్నాక చిత్ర యూనిట్ పోర్చుగల్ వెళ్తుంది. అక్కినేని నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది.

చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ, ” చి || ల || సౌ చిత్రాన్ని నాగార్జున గారు చూసి మెచ్చుకుని అన్నపూర్ణ ద్వారా రిలీజ్ చేశారు. ఆ చిత్రాన్ని చూసినప్పుడే ఆయన నాతో సినిమా చేస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నాకు ఈ చిత్రాన్ని చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.” అన్నారు

అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మి, వెన్నెల కిషోర్, రావు రమేష్, నాజర్, ఝాన్సీ, దేవదర్శిని నటిస్తున్న ఈ చిత్రానికి
స్క్రీన్ ప్లే : రాహుల్ రవీంద్రన్, సత్యానంద్, డైలాగ్స్ : కిట్టు విస్సప్రగడ, రాహుల్ రవీంద్రన్, ఎడిటర్స్ : చోట వి ప్రసాద్, బి.నాగేశ్వర రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్స్ : ఎస్. రామకృష్ణ, మోనికా నీగోత్రే సబ్బని, కాస్ట్యూమ్స్ : అనిరుధ్ సింగ్, దీపికా లల్వాని, డి.ఓ.పి : ఎం.సుకుమార్, సంగీతం : చైతన్ భరద్వాజ్
నిర్మాతలు : అక్కినేని నాగార్జున, పి.కిరణ్
దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్

Inspired by the fun and laughs of the Super Hit original Manmadhudu, Nagarjuna and new age director Rahul Ravindran come together. Cast, crew and family came together at Annapurna studios this morning for the puja before the film starts shooting.

Naga Chaitanya and Amala Akkineni graced the event to switch on the camera and give the auspicious first clap. The crew is planning to leave for Europe for regular shooting. Actor Rahul Ravindran who made a successful directorial debut, will be directing ‘Manmadhudu 2’ along with a solid team of technicians.

Chaitan Bharadwaj of ‘RX100’ fame will be composing music while M Sukumar will handle the cinematography. Manam Enterprises and Anandi Art Creations banners will jointly produce the movie.