ఇస్మార్ట్ శంక‌ర్ ను దోచుకున్న న‌భా

0
1477
పూరీ జగన్నాథ్, రామ్.. ఇద్దరూ ఇప్పుడు డిజాస్టర్స్ లో ఉన్నారు. పూరీ మరీ దారుణంగా మారాడు. అతని కథల్లో ఏమాత్రం కొత్తదనం కనిపించడం లేదు. ఇటు రామ్ కొత్త ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో వీరు కలిసి ఓ సినిమా చేస్తున్నారంటే కొంత ఆశ్చర్యం కలిగినా.. దాన్ని ఆసక్తిగా మార్చడంలో సక్సెస్ అయిందీ మూవీ టీమ్. ఎన‌ర్జిటిక్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్, ఆ ఎనర్జీని బాక్సాఫీస్ వద్ద చూపించలేకపోతున్నాడు. అదే అతని మైనస్. అయితే ఇప్పుడు టాలీవుడ్ ట్రెండ్ బాగా మారిపోయింది. మారిన ఆ ట్రెండ్ లోకి సరికొత్త లుక్ తో ఎంటర్ అవుతున్నాడు రామ్. ‘‘ఇస్మార్ట్ శంకర్’’ అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ మూవీ కూడా పూరీ జగన్నాథ్ శైలిలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు. ఇందులో హీరోయిన్ ఎవ‌రా అని జ‌రుగుతున్న చ‌ర్చ‌కు ఇప్పుడు తెర‌పడింది.
నన్ను దోచుకుందువ‌టే సినిమాతో ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచుకున్న న‌భా న‌టేష్ ని రామ్ ప‌క్క‌న హీరోయిన్ గా ఫైన‌ల్ చేసిన‌ట్లు తెలుస్తుంది. ఆల్రెడీ మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న న‌భా న‌టేష్ ,ఈ సినిమా త‌ర్వాత త‌ప్ప‌కుండా ఇంకా మంచి అవ‌కాశాలు రావ‌డం ఖాయ‌మని నమ్ముతుంది ఈ బెంగుళూరు భామ‌. పూరీ క‌నెక్ట్స్ బ్యాన‌ర్ లో ఛార్మీ నిర్మాత‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు మ‌ణిశ‌ర్మ సంగీతం అందించ‌నున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here