‘నా పేరు సూర్య’ మూవీ రివ్యూ

0
415

స‌రైనోడు, డీజే లాంటి మాస్ చిత్రాల త‌ర్వాత అల్లు అర్జున్ హీరోగా, వ‌క్కంతం వంశీ అనే రైట‌ర్ ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ చాలా రోజుల త‌ర్వాత నాగ‌బాబు మ‌ళ్లీ నిర్మించిన చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. మంచి అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం ఆ అంచ‌నాలను అందుకోగ‌లిగిందా లేదా స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థః
చిన్న‌ప్ప‌టి నుంచి క‌ట్టలు తెంచుకునే కోపంతో పెరిగిన సూర్య (అల్లు అర్జున్) పెద్ద‌య్యాక ఆర్మీలో సోల్జ‌ర్ గా జాయిన్ అవుతాడు. త‌న కోపంతో రూల్స్ కు వ్య‌తిరేకంగా ప‌నులు చేయ‌డంతో త‌న పై అధికారులు సూర్య‌ను ఉద్యోగం నుంచి త‌ప్పించి, సూర్య చిన్న‌నాటి నుంచి కంటున్న క‌ల బార్డ‌ర్ ను దాటాలంటే, త‌న‌కు వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ సైక్రియాట్రిస్ట్ రామ్‌రాజ్(అర్జున్) నుంచి సంత‌కం తీసుకురావాల‌ని ఆర్మీ ఛీఫ్ కండిష‌న్ పెడతాడు. ఆర్మీ లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఆ సంత‌కం కోసం సూర్య ప‌డిన తిప్ప‌లేంటి? వ‌ర్ష (అను ఇమ్మాన్యుయేల్)తో త‌న ప్రేమాయ‌ణం ఎలా సాగింది? సూర్య చివ‌ర‌కు అయినా కోపం త‌గ్గించుకుని బార్డ‌ర్ కు వెళ్లాడా లేదా అన్న‌ది తెర‌మీదే చూడాల్సిందే..

న‌టీన‌టుల ప్ర‌తిభః
సోల్జ‌ర్ గా అల్లు అర్జున్ త‌న కెరీర్లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఒక న‌టుడిగా సినిమా మొత్తాన్ని త‌న భుజాల‌పై వేసుకుని న‌డిపించాడు. ఆ బాడీ లాంగ్వేజ్, ఫైట్స్, మేన‌రిజ‌మ్స్ అన్నింట్లోనూ ది బెస్ట్ అనిపించుకున్నాడు. హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ పాట‌ల‌కే ప‌రిమిత‌మైన‌ప్ప‌టికీ, ఉన్నంతలో త‌న న‌ట‌న ఇంకా మెరుగుప‌ర‌చుకోవాల‌నిపించేలా ఉంది. అర్జున్ పాత్ర డిజైన్ చేసిన విధానమైతే బావుంది కానీ అది స‌రిగా తెర‌పై చూపించ‌డంలో ఫెయిల్ అయిన‌ట్లు అనిపించిన‌ప్ప‌టికీ, అర్జున్ త‌న న‌ట‌న‌తో ఎప్ప‌టిలాగానే ఆక‌ట్టుకున్నాడు. శ‌ర‌త్ కుమార్, అనూప్ ఠాకూర్, ప్ర‌దీప్ రావ‌త్ మంచి న‌ట‌న క‌న‌బ‌రిచారు. మిగిలిన వారిలో పోసాని, సాయి కుమార్, బొమ‌న్ ఇరానీ, రావు ర‌మేష్, వెన్నెల కిషోర్, న‌దియా త‌మ త‌మ ప‌రిధిలో బాగా చేశారు.

సాంకేతిక నిపుణులుః
డైర‌క్ట‌ర్ గా వ‌క్కంతం వంశీ కి ఇది మొద‌టి సినిమానే అయిన‌ప్ప‌టికీ, డైర‌క్ట‌ర్ గా ప్రేక్ష‌కుడు ఏం ఆశిస్తాడు అనేది తెలుసుకోగ‌లిగి అలాంటి స‌న్నివేశాలే రాసుకున్నాడు. ఫ‌స్టాఫ్ అంతా గూస్‌బంప్స్ వ‌చ్చే సీన్స్ రాసుకున్న వంశీ, సెకండాఫ్ కు వ‌చ్చేస‌రికి సినిమాను కాస్త డ‌ల్ గా నడిపించిన‌ప్ప‌టికీ, ఒక్క‌ ఫైట్ తో సినిమాను నెక్స్ట్ లెవ‌ల్ కు తీసుకెళ్లాడు. రైట‌ర్ గా కూడా వంశీ స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్పాలి. మంచి డైలాగులు రాసుకున్నాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. విశాల్- శేఖ‌ర్ అందించిన పాట‌లు బావున్నాయి కానీ స్క్రీన్ మీద సైనికా పాట మిన‌హాయించి మిగ‌తావేవీ గొప్ప‌గా అనిపించ‌వు. రీరికార్డింగ్ ఆశించిన స్థాయిలో లేదు. ఎడిటర్ ఇంకాస్త్ త‌న క‌త్తెర‌కు ప‌దును పెట్టాల్సింది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః
అల్లు అర్జున్
ఫైట్స్

మైన‌స్ పాయింట్స్ః
రీరికార్డింగ్
సెకండాఫ్

పంచ్‌లైన్ః సూర్య వ‌న్ మ్యాన్ షో
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here