నా లవ్ స్టోరీ ఆడియో విడుదల, జూన్ 29న సినిమా రిలీజ్

0
242
అందమైన ప్రేమకథ గా మలిచిన ‘నాలవ్ స్టోరీ’ ఆడియో విడుదల ప్రసాద్ ల్యాబ్ లో చిత్ర ప్రముఖుల చేతుల మీదుగా జరిగింది.  ప్రముఖ రచయితలు శివశక్తి దత్త , భువనచంద్ర లు ఆడియోని ఆవిష్కరించి ప్రత్యేక అతిథులు ప్రవీణ్ సత్తారు, అనీల్ రావిపూడి, సి. ఉమా మహేశ్వరరావులకు అందజేసారు.  అనీల్ రావిపూడి థియేట్రికల్ ట్రైలర్ ని లాంఛ్ చేయగా, ప్రవీణ్ సత్తారు, సి. ఉమా మహేశ్వరరావు, రచయిత భారతీబాబు, ఆదిత్యా మ్యూజిక్ నిరంజన్ లు  సాంగ్స్ ని విడుదల చేసారు.  ఈ వేడుకలో చిత్ర యూనిట్ పాల్గోని తమ సినిమా విశేషాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా శివశక్తి దత్త మాట్లుడుతూ:
‘దర్శకుడు శివ గంగాధర్  నాకు చాలా కాలంగా తెలుసు. శివ తన శక్తినంతా ధారపోసి ఈ సినిమాని రూపొందించాడు. ఈ సినిమాలో పాటలు రాయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా తప్పకుండా ప్రేక్షకులు ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. ’ అన్నారు.
భువనచంద్ర మాట్టాడుతూ:
‘ నాలవ్ స్టోరీ గురించి మాట్లాడాలంటే నాకు నా లవ్ స్టోరీ గుర్తుకు వస్తుంది. దర్శకుడు కథ చెప్పగానే చాలా ఇంప్రెస్ అయ్యాను. రచయితగా కొంత గ్యాప్ వచ్చింది. శివశక్తి దత్త గారి వంటి విద్వత్తు కలిగిన రచయితతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. హీరో, హీరోయిన్లు బాగా చేసారు. ప్రేక్షకుల ఆదరణ పొందుతారని ఆశిస్తున్నాను ’ అన్నారు.
దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ:
‘ హీరో బాగున్నాడు, హీరోయిన్ బాగుంది.  చూసిన పాటలు బాగున్నాయి. సినిమా కూడా బాగుంటుందని అనుకుంటున్నారు. టీం అందరికీ ఆల్ ద బెస్ట్ ’ అన్నారు.
అనీల్ రావిపూడి మాట్లాడుతూ:
‘ థియేట్రికల్ ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉంది. యూత్ ని ఎట్రాక్ట్ చేసే కంటెంట్ తో వస్తున్న నాలవ్ స్టోరీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ’ అన్నారు.
హీరో మహిధర్ మాట్లాడుతూ:
ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. అవుట్ పుట్ చూసాక చాలా నమ్మకంగా ఉన్నాము. దర్శకుడు శివ గంగాధర్ కథ గా చెప్పినప్పుడే ఇంప్రెస్ అయ్యాను. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని అనకుంటున్నాను.
దర్శకుడు శివగంగాధర్ మాట్లుడుతూ:
‘ఈ సినిమాకు నాలు గు పిల్లర్స్  ఉన్నాయి. అవి హీరో ఫాదర్ గా చేసిన తోటపల్లిమధు, హీరో మహిధర్, హీరోయిన్ సాక్షిసింగ్  మరియు  హీరోయిన్ ఫాదర్ గా చేసిన శివన్నారాయణ. ఈ నలుగురి మద్యలో జరిగే కథే ‘ నాలవ్ స్టోరీ’. గేటడ్ కమ్యునిటీ బ్యాక్ డ్రాప్ లో ఒక అందమైన ప్రేమకథను చెప్పాం. తప్పకుండా మీ మనసుకు హాత్తకునే అంశాలను పొందుపరిచాం.  సినిమా పైరసీ ఇండస్ట్రీని నాశనం చేస్తుంది. సినిమా తీయాలంటే భయపడే పరిస్థితి కి తెచ్చింది. దయచేసి పైరసీని చేయకండి ’ అన్నారు.
అంకురం దర్శకుడు సి. ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ:
‘కష్ట పడే తత్వం ఉన్నవాడికే దర్శకత్వం అబ్బుతుంది. శివ నాకు చాలాకాలంగా తెలసు. అతని శక్తి నాకు తెలుసు. సినిమా  నిజాయితీ పరుడు. ఈ సినిమా బాగా తీసాడు. రఫ్ కట్ లో చూసాను చాలా బాగుంది. ఇందులో నటించిన మహిదర్, సాక్షిసింగ్  చాలా బాగా చేసారు. ఎక్సె ప్రెషన్స్ చాలా సెటిల్డ్ గా ఉన్నాయి. ఈ టీం విజయం సాధించాలని కోరకుంటున్నాను ’అన్నారు.
మ్యూజిక్ దర్శకుడు వేదనివాన్  మాట్లాడుతూ:
‘ఈ సంగీతం ఇంత బాగా రావడానికి మా టీం కారణం. శివశక్తి దత్తా, భువన చంద్ర గార్లతో కలసి పనిచేయడం మరిచిపోలేని అనుభూతినిచ్చింది.  నాకు ఈ అవకాశం ఇచ్చిన టీం కి ధన్యావాదాలు.
పాటలు మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను.’ అన్నారు.
హీరోయిన్ సోనాక్షి సింగ్ మాట్లాడుతూ:
‘ఈ అవకాశం ఇచ్చిన చిత్ర నిర్మాతలకు చాలా థ్యాంక్స్ .  ఈ సినిమా నాకు చాలా నేర్పించింది. పాటల కోసం థాయ్ లాండ్ కి వెళ్ళాం అక్కడ షూట్ చేసినన్ని రోజులు మోస్ట్ మెమరబుల్ డేస్.
హీరో నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ లా అయిపోయాడు. నన్ను నమ్మి ఈ రోల్ నాకు ఇచ్చిన దర్శకుడికి చాలా థ్యాంక్స్.’ అన్నారు.
హీరో మహిధర్ మాట్లాడుతూ:
‘ఈ సినిమా ఆడియో రిలీజ్ కి అతిథులుగా విచ్చేసిన ప్రవీణ్ సత్తారు, అనీల్ రావిపూడి లకు ప్రత్యే క థన్యవాదాలు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం.  పాటలు బాగా వచ్చాయి.  యూత్ కి కనెక్ట్ అయ్యే ప్రేమకథ ఇది. దర్శకుడు శివగంగాధర్ తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసే రకం. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.  జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం..తప్పకుండా ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది ’ అన్నారు.
నటీ నటులు:
మహిధర్, సాక్షిసింగ్  ,  శివన్నారయణ , తోటపల్లి మధు , చమ్మక్ చంద్ర,  డి.వి, దివ్యశ్రీ గౌడ్ , సరిత రెడ్డి , రాకేష్ , భూపతి రాజు
టెక్నిషియన్స్:
మాటలు: మాల్కారి శ్రీనివాస్ , పాటలు: శివశక్తి దత్తా, భువనచంద్ర , డాన్స్: బంగార్రాజు, ఫైట్స్:  రామ్ సుంకర , ఎడిటర్: నందమూరి హారి , సంగీతం : వేదనివాస్ , డి ఓ పి : కిరణ్ , నిర్మాతలు: లక్ష్మి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కె. శేషగిరిరావు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శివ గంగాధర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here