ట్రైల‌ర్ టాక్ః మ‌జ్ను- అంద‌ర‌బ్బాయిల్లానే..!

0
1382
ఏఎన్నార్ నుంచి నాగార్జున‌కు, నాగార్జున నుంచి అఖిల్ కు వ‌చ్చిన టైటిల్ ‘మ‌జ్ను’. టైటిల్ కు త‌గ్గ‌ట్లే పోస్ట‌ర్లు, టీజ‌ర్, పాట‌ల‌న్నీ ఆ థీమ్ ను ఎలివేట్ అయ్యేలా ప్లాన్ చేసారు. తొలి ప్రేమ‌తో బ్లాక్ బ్ల‌స్ట‌ర్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి ఈసారి కూడా ఏదో మ్యాజిక్ చేయ‌బోతున్నాడ‌ని టీజ‌ర్ తోనే అంద‌రికీ అర్థ‌మైంది. ఇప్పుడు సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుద‌ల చేసారు.

ట్రైల‌ర్ మొత్తం అఖిల్ – నిధి అగర్వాల్ మధ్య ఫ్ల‌ర్ట్, ల‌వ్ కోణాల్నే చూపించారు. చిలిపి కుర్రాడైన‌ అఖిల్ అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేస్తూ లైన్ లో పెడుతుంటాడు. అబ‌ద్ధాలు చెప్పి మ‌రీ పడ‌గొడ‌తాడు. అతడికి పడని అమ్మాయే లేదు. అలా నిధిని కూడా ఫ్లర్ట్ చేస్తాడు. అయితే అది కేవలం కవ్వించి వదిలేసే ప్రేమ కాదని మజ్ను తెలుసుకునేప్పటికి అంతా అయిపోతుంది. అన్ని ప్రేమకథల్లానే ఈ కథలోనూ బోలెడంత డ్రామా విరహం ఉంటుందని ట్రైలర్ చెబుతోంది. అమ్మాయిలతో ప్రేమ శాశ్వతం కాదని అందరు బోయ్స్ లానే నమ్మే మజ్నుని చివరికి నిధి గెలుచుకుందో లేదో తెరపై చూడాల్సిందే.

ట్రైల‌ర్ వ‌ర‌కు బాగానే ఉంది కానీ క‌థ‌లో ట్విస్ట్ ను ఏ మాత్రం ర‌క్తి క‌ట్టించార‌న్న‌దాని మీదే సినిమా రిజ‌ల్ట్ ఆధార‌ప‌డి ఉంటుంది. థ‌మ‌న్ రీరికార్డింగ్, పాట‌లు సినిమాకు బాగా ప్ల‌స్ అవుతాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. త‌న మొద‌టి రెండు సినిమాలతో సాధించలేని విజ‌యాన్ని మ‌జ్నుగా అయినా సాధిస్తాడా అన్న‌ది ఈ నెల 25న తెలియ‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here