‘మిస్ట‌ర్ మజ్ను’ మూవీ రివ్యూ

0
1488

ఏఎన్నార్ నుంచి నాగార్జున‌కు, నాగార్జున నుంచి అఖిల్ కు వ‌చ్చిన టైటిల్ ‘మ‌జ్ను’. టైటిల్ కు త‌గ్గ‌ట్లే పోస్ట‌ర్లు, టీజ‌ర్, పాట‌లు ఇలా అన్నీ ఆ థీమ్ ను ఎలివేట్ అయ్యేలా ప్లాన్ చేసారు. తొలి ప్రేమ‌తో బ్లాక్ బ్ల‌స్ట‌ర్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి ఈసారి కూడా ఏదో మ్యాజిక్ చేయ‌బోతున్నాడ‌ని టీజ‌ర్, ట్రైల‌ర్ల‌ తోనే అంద‌రికీ అర్థ‌మైంది. ఎప్ప‌టి నుంచో మంచి విజ‌యం కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కు ‘మిస్ట‌ర్ మ‌జ్ను’ అయినా త‌ను అనుకున్న విజ‌యాన్ని అందించిందా? వెంకీ అట్లూరి త‌న విజ‌యాన్నికొన‌సాగిస్తాడా అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం.

న‌చ్చిన ప్ర‌తీ అమ్మాయిని ఫ్ల‌ర్ట్ చేస్తూ.. లైన్ లో పెడుతుంటాడు విక్కీ (అఖిల్) ఎంత‌టి అంద‌గ‌త్తైనా అత‌నికి ప‌డాల్సిందే. అత‌న్ని చూసిన నిక్కీ (నిధి అగ‌ర్వాల్) ముందు త‌న‌ని వెధ‌వ అనుకున్నా.. త‌ర్వాత ద‌గ్గ‌ర నుంచి చూసి అర్థం చేసుకుని అత‌ని ప్రేమ‌లో ప‌డి, రెండు నెల‌ల పాటు ఇద్దరం ప్రేమించుకుని త‌ర్వాత ఇద్ద‌రికీ ఓకే అనుకుంటే ఇంట్లో చెప్పడం.. లేదంటే వ‌దిలేయ‌డం అనుకుని ఒప్పందం చేసుకుంటారు. కానీ వారు అనుకున్న‌ది ఒక‌టి అక్క‌డ జ‌రిగేది ఇంకోటి అన్న‌ట్లు నిధియే విక్కీని వ‌దిలేసి వెళ్లిపోతుంది. అస‌లు నిక్కీ విక్కీని వ‌దిలేసి వెళ్ల‌డానికి కార‌ణ‌మేంటి? వారిద్ద‌రూ మ‌ళ్లీ ఒక్క‌టెలా అయ్యార‌న్న‌దే మిగ‌తా క‌థ‌.

”గుర్తుపెట్టుకోండి.. అఖిల్ విల్ ది ఫైనెస్ట్ యాక్ట‌ర్ ఇన్ టాలీవుడ్ అని అంద‌రూ అనుకునే రోజు చాలా త్వ‌ర‌లోనే ఉంది” అని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ చెప్పిన మాట‌లను అఖిల్ నిజం చేయ‌గ‌ల‌డు అని ఈ సినిమాతో చెప్పొచ్చు. ఇంత‌కు ముందు సినిమాల్లోని అఖిల్ యాక్టింగ్ కు, ఈ సినిమాలో అఖిల్ యాక్టింగ్ కు చాలా తేడా ఉంది. ఎన్న‌డూ లేని విధంగా త‌న న‌ట‌న‌లో ప‌రిణితి క‌నిపించింది. ఇంత‌కు ముందు సినిమాల కంటే బాగా చేసాడు కానీ ఇంకా అఖిల్ నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. ఇన్నాళ్ల‌కు త‌నకు స‌రైన క్యారెక్ట‌ర్ ప‌డింది. త‌న స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, యాటిట్యూడ్, డ్యాన్సులు, ఎమోష‌న్స్ ను డీల్ చేసిన విధానం అన్నీ బావున్నాయి. ఇక డ్యాన్సుల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిందేముంది. ఎప్ప‌టిలాగే ఇరగ‌దీసాడు.నిధి అగ‌ర్వాల్ ఎక్స్‌ప్రెష‌న్స్ పెద్ద‌గా ఏమీ ఇవ్వ‌లేక‌పోయింది. స్టోరీ మొత్తం త‌న మీదే న‌డుస్తున్నా.. త‌నొక హీరోయిన్ అనిపించేలా నిధి ఆక‌ట్టుకోలేక‌పోయింది. రావు ర‌మేష్ ఎప్ప‌టిలాగే తన సెటిల్డ్ పెర్ఫామెన్స్ తో ఆక‌ట్టుకున్నాడు. మిగిలిన వారిలో ప్రియ‌ద‌ర్శి, పవిత్రా లోకేష్‌, నాగ బాబు, విద్యుల్లేఖ‌, త‌దిత‌రులు వారి పాత్ర‌ల పరిధి మేర ఆక‌ట్టుకున్నారు.

అమ్మాయిల‌ను ఫ్ల‌ర్ట్ చేసి.. కొన్ని రోజులు వారితో తిరిగి, హ్యాపీ గా విడిపోయి.. త‌ర్వాత ఇంకొక‌రిని ఫ్ల‌ర్ట్ చేస్తూ తిర‌గ‌డం, ఆఖ‌రికి ఒక అమ్మాయి రాక‌తో ఆ అబ్బాయి పూర్తిగా మారిపోయి.. ఆ అమ్మాయి మాత్ర‌మే కావాల‌నుకోవ‌డం.. మిస్ట‌ర్ మ‌జ్ను ను క‌థ‌గా చెప్పాలంటే ఇంతే. ఇంత‌ సింపుల్ గా ఉన్న క‌థ‌ను ద‌ర్శ‌కుడు డిఫ‌రెంట్ స్క్రీన్ ప్రెజెన్స్, మంచి మాట‌లు రాసుకుని.. ప్రేక్ష‌కుడి దృష్టి క‌థ మీద‌కు వెళ్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు. ఫ‌స్ట్ హాఫ్ వ‌ర‌కు మంచి ఫ్యామిలీ ఎమోష‌న్స్, స‌ర‌దా స‌రదాగా న‌డుపుతూ వ‌చ్చిన వెంకీ.. సెకండాఫ్ లో కాస్త డ‌ల్ అయ్యాడ‌నే చెప్పాలి. ఒక్క‌సారిగా క‌థ‌ను మ‌ళ్లీ లండ‌న్ కు తీసుకెళ్లి అన‌వ‌స‌రమైన సీన్స్ ను పెట్టి అవ‌స‌రం లేక‌పోయినా సాగ‌దీశాడ‌నిపిస్తుంది. ఏదేమైనా త‌న ప్ర‌య‌త్నం మరీ వృధా అయితే చెప్ప‌లేం. సాంకేతికంగా కూడా మిస్ట‌ర్ మ‌జ్ను చాలా గొప్ప‌గా తెర‌కెక్కింది. జార్జ్ విలియమ్స్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకే మేజ‌ర్ హైలైట్ గా చెప్పుకోవ‌చ్చు. ప్ర‌తీ ఫ్రేమ్ ఎంతో నీట్ గా, ఒక విజువ‌ల్ ట్రీట్ గా అనిపిస్తుంది. థ‌మ‌న్ మ‌రోసారి త‌న ప‌నిత‌నంతో మెప్పించాడు. వెంకీ, థ‌మ‌న్ క‌లిసి ఆల్రెడీ తొలిప్రేమ కు ప‌నిచేయ‌డం వ‌ల్ల తెలియ‌కుండానే ఆ సినిమాతో పోల్చేస్తుంటారు కానీ దేని విలువ దానిదే. మిస్ట‌ర్ మ‌జ్ను లో కూడా అదే త‌ర‌హాలో మంచి పాట‌లతో పాటూ.. అద్భుత‌మైన రీరికార్డింగ్ ను కూడా ఇచ్చి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు థ‌మ‌న్. ఎడిటింగ్ బావుంది కానీ సెకండాఫ్ ను కాస్త ట్రిమ్ చేయాల్సింది. నిర్మాణ విలువ‌లు చాలా రిచ్ గా ఉన్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః
మాట‌లు
సినిమాటోగ్ర‌ఫీ
సంగీతం

మైన‌స్ పాయింట్స్ః
హీరోయిన్
సెకండాఫ్ లో కొన్ని సీన్స్

పంచ్‌లైన్ః మిస్ట‌ర్ మ‌జ్ను.. ఇన్నాళ్ల‌కు అఖిల్ కు..!
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here