Vamshi Paidipally Leave Him?


ప్రస్తుతం తన రెండో సినిమా మొదలెట్టే పనిలో బిజీగా ఉన్నాడు యంగ్ హీరో అఖిల్.. ఎప్పుడైతే తన తొలి సినిమా భారీ అంచ‌నాల‌తో వచ్చి డిజాస్ట‌ర్ అయ్యిందో.. అప్పుడే క్రిటిసిజం మొదలైంది. ఆ సినిమా యావరేజ్ అయినా, ఇప్పుడు ఆ హీరో కి ఉండే హైప్ వేరేలా ఉండేది. కాకపోతే మొద‌టి ఫ్లాప్ అవ్వడం వలన ఇప్పుడు చాలా సతమతమవుతున్నాడు.. ఇంకా డెసిషన్ తీసుకోలేకపోతున్నాడు అంటూ విశ్లేష‌ణ‌లు బాగానే వచ్చాయి. అక్కినేని అఖిల్‌ గురించి రోజుకో వార్త బయటకు వస్తోంది. అఖిల్.. తన సెకండ్ మూవీ కోసం జూన్ నుంచి సెట్స్‌పైకి వెళ్తాడంటూ వారం రోజుల కిందట వార్త‌లొచ్చాయి. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో రానున్న ఈ మూవీకి అంతా సిద్ధం అయిపోయింద‌ని, ముహూర్తం తర్వాత సెట్స్‌పైకి వెళ్లడమే ఆలస్యమంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు వంశీ పైడిపల్లి చెబుతున్న రొమాంటిక్ స్టోరీలేవీ అఖిల్‌కు సెట్ కావడంలేదని, యువ హీరో మాత్రం మాస్, యాక్షన్ ఫిల్మ్ చేయాల్సిందేనని అంటున్నాడట. దీంతో ఈ ప్రాజెక్టు నుండి దర్శకుడు వంశీ తప్పుకున్నట్లు ప్రచారం మొదలైపోయింది.


Follow Us