The Reason Behind Bunny Attend 'oka Manasu' Audio


ఒక మ‌న‌సు ఆడియోకు బన్నీ అందుకే వ‌స్తున్నాడా..?
  ఈ మ‌ధ్య ''చెప్ప‌ను బ్ర‌ద‌ర్..'' అంటూ బాగానే పాపుల‌ర్ అయ్యాడు అల్లు అర్జున్. స‌రైనోడు బ్లాక్ బ‌స్ట‌ర్ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన ఒక ఫంక్ష‌న్ లో అభిమానులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి చెప్ప‌మంటే చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అంటూ వేదిక‌పైనే అనేశాడు.ఏదో స్టేజ్ మీద తొంద‌ర‌పాటులో అలా అన్నాడేమో అనుకున్నారు కొంత‌మంది. త‌ర్వాత ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు చెందిన ఒక ప్ర‌తినిధి అల్లుఅర్జున్ ని ఇంట‌ర్వూ చేస్తూ.. మొన్న ఫంక్ష‌న్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అంటూ మీరు అన్న మాట సోష‌ల్ మీడియాలో అనేక ర‌కాలుగా వినిపిస్తుంది. దీనిపై మీరేమైనా స్పందిస్తారా అని అడిగితే ..ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాను. ''ప‌వ‌న్ గురించి మాట్లాడ‌ను బ్ర‌ద‌ర్..'' ఇంకా వేరే ఏమైనా ప్ర‌శ్న‌లుంటే అడ‌గంటి అంటూ మ‌రోసారి బ‌దులిచ్చాడు బ‌న్నీ. ఇంత‌క‌ముందు ఏ ఫంక్ష‌న్ లో ప‌వ‌న్ గురించి అడిగినా ఏదోటి మాట్లాడి బ‌న్నీ వాళ్ల‌ను తృప్తి ప‌రిచేవాడు. అలాంటిది ఇప్పుడు స‌డ‌న్ గా ఆయ‌న గురించి మాట్లాడ‌కుండా ఉండ‌టానికి రీజ‌న్ ఏమై ఉంటుంది అనేవార్త అన్నింటా వినిపిస్తుంది. ఇదిలా ఉండ‌గా... ఈరోజు జ‌ర‌గ‌నున్న ఒక మ‌న‌సు ఆడియోకు బ‌న్నీ ఛీఫ్ గెస్ట్ గా రానున్నాడు. నిన్న‌సాయంత్రం వ‌ర‌కు ఆడియో లాంచ్ కు వ‌చ్చేదీ, లేనిదీ కన్ఫార్మ్ చేయ‌ని బ‌న్నీ.. చివ‌ర‌కు ఏమ‌నుకున్నాడో ఏమో వ‌స్తున్నా అని చెప్పేశాడు. నిన్న‌టి వ‌ర‌కు డౌట్ గా ఉన్న అల్లుఅర్జున్ అప్ప‌టిక‌ప్పుడు ఏమి ఆలోచించి వ‌స్తాన‌ని చెప్పాడు అన్న‌దే ఇప్పుడు అంద‌రినీ వెంటాడుతున్న ప్ర‌శ్న‌.దీన్ని బ‌ట్టి చూస్తే ఒక మ‌న‌సు ఆడియో లో ప‌వ‌న్ గురించి మొన్నఅల్లుఅర్జున్ అలా ఎందుకు అన్నాడో క్లారిటీ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు అంటున్నాయి. చూద్దాం.. వ‌స్తున్నాడు గా బన్నీ బ్ర‌ద‌ర్... ఏం మాట్లాడ‌తాడో..


Follow Us