Tapsee Serching For House


సాగ‌ర‌తీరాన ఇల్లు కావాలి
 
ఎవ‌రికైనా బీచ్ న‌చ్చితే ఎక్కువ‌గా వెళుతుంటారు. కానీ తాప్సీ అయితే అక్క‌డ సాగ‌రతీరంలో ఇల్లు కొన‌డానికే ప్ర‌య‌త్నిస్తుంద‌ట‌. ఈమ‌ధ్య ఒక హిందీ సినిమా షూటింగ్ కోసం గోవాకు వెళ్లిన తాప్సీ షూటింగ్ నేప‌థ్యంలో అక్క‌డే ఉండాల్సి వ‌చ్చింది. దీంతో అక్క‌డి బీచ్ అందాల‌కు మైమ‌రచిపోయి, ఎప్పుడైనా త‌న‌కు ఖాళీ దొరికిన‌ప్పుడు హాలిడే కి వ‌స్తుండాల‌ని నిర్ణ‌యించుకుని, అక్క‌డే ఓ ఇల్లు కొనాల‌ని నిర్ణ‌యించుకుంద‌ట‌. సాగ‌ర తీరంలో ఇల్లు దొర‌క‌డ‌మే క‌ష్ట‌మంటుంటే, పోర్చుగీసు క‌ల్చ‌ర్ తో కట్టిన ఇల్లును కొనాల‌ని తాప్సీ ముచ్చ‌ట ప‌డుతోంది. ప్ర‌స్తుతం ఇంటి అన్వేష‌ణ‌లో ఉన్న తాప్సీ ఆల్రెడీ కొన్నిఇళ్లు చూసింద‌నీ, త్వ‌ర‌లోనే ఏదోటి ఫైన‌ల్ చేయ‌నుందట‌.


Follow Us