Supreme Star Launched Burning Star Teaser


Sampoornesh Babu ...Hero who entered into Telugu Film Industry with his debut movie Hrudaya Kaleyam.From his debut movie he named himself as burning star to the industry & like self employment he created his own image while entering into TFI. Sampoo stated at the time of his debut movie " More than Glamour luck & hard work is important in industry ".. He proved this statement with his debut movie hit & he became over night star in the industry.To say it's purely luck & efforts of sampoo to get this name.It is not so easy to become a over night star in TFI. Now he is ready with his new movie KOBBARIMATTA.. Teaser of Kobbarimatta is launched by Mega hero, supreme star Sai Dharam Tej.. On this occasion sampoo shared that this movie is very special to him & he feels lucky to have this story . Kobbarimatta is directed by "Rupak Ronaldson" & Hrudayakaleyam fame director "Stefen Shankar" gave Story & Screenplay. This movie is completely a settairical movie by Sampoo & plays role of "Androidu" (PAPARAYUDU) . Recently, team of Kobbarimatta released First look & one song which created enthusiasm in audience about Teaser . Kobbarimatta Teaser is some thing different from others,basically Teaser will be around 30 seconds - 1minute. This teaser is completely 2.38 minutes & in this Sampoo give speech on wonam which took 2mins. Most surprising thing is sampoo delivers that lengthy 2mins dialogue non stop & presented it very hilariously. Let's wait & watch how Sampoo's records will turn Box office & TFI ethics..   సంపూర్ణేష్ బాబు.. ఇండస్ట్రీలో ఉండాలంటే అందం అక్కర్లేదు.. అదృష్టం ఉంటే చాలని చెప్పిన హీరో. తనను తానే బర్నింగ్ స్టార్ గా ప్రకటించుకొని తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సంపూ. సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ లా హృదయ కాలేయం సినిమాతో తనను తానే స్టార్ గా అనౌన్స్ చేసుకు న్నాడు సంపూ. ఆ సినిమా విజయం సాధించడంతో సంపూ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. సెటైర్లకు కొలవుగా ఉండే సంపూ సినిమాలంటే కొన్ని వర్గాల ప్రేక్షకులకు మహా ఇష్టం. తరువాత పలు చిత్రాల్లో కనిపించిన ఆయన ఇప్పుడు తాజాగా ‘కొబ్బరి మట్ట’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ ను ఈరోజు మెగా హీరో, సుప్రీమ్ స్టార్ సాయి ధ‌రమ్ తేజ్ లాంచ్ చేశారు. ఈ సినిమా తన జీవితానికి దొరికిన ఒక ఆణిముత్యమని సంపూ హర్షం వ్యక్తం చేశాడు. హృదయ కాలేయంకు దర్శకత్వం వహించిన స్టీఫెన్ శంకర్ కొబ్బరిమట్టకు కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. రూపక్ రొనాల్డ్ సన్ దర్శకుడు. ఇది కూడా పూర్తిస్థాయి సెటైరికల్ మూవీనే. ఇందులో ఆండ్రాయుడు, పాపారాయుడుగా నటిస్తున్నాడు సంపూర్ణేష్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ఓ పాట సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. ఇక‌పోతే ఇవాళ రిలీజైన టీజ‌ర్ ఏకంగా 2.38 నిమిషాల వ్య‌వ‌ధితో ఉంది. ఎక్క‌డైనా టీజ‌ర్ అంటే 30 సెక‌న్లు, 40 సెక‌న్లు, మ‌హా అయితే ఒక నిమిషం లోపు ఉంటుంది కానీ ఈ టీజ‌ర్ మాత్రం 2.38 నిమిషాలు ఉంది. ఇందులో సంపూ ఆడదాని గురించి చెప్పే డైలాగే 2నిమిషాలుంటుంది. కానీ ఆ డైలాగ్ డెలివ‌రీ, అంత‌పెద్ద డైలాగ్ ని ఏక‌ధాటిగా చెప్ప‌డం నిజంగా క‌ష్ట‌మే సుమీ. చూద్దాం ఈ కొబ్బ‌రిమ‌ట్ట‌తో సంపూ ఇండస్ట్రీని ఎటువైపు తీసుకెళ్తాడో..   https://www.youtube.com/watch?v=a7wcg5m0OGM


Follow Us