Sri Sri Review


Sri Sri is a lecturer who works in Law college lends a happy life with his wife and daughter swetha. Swetha is a generalist who tries to bring out the cheaters Bikshapathi and sons of JK. Before reaching police Bikshapathi and sons of JK kill her cruelly. Sri sri tries to punish them but using their influence they are out from case. Now,Sri sri thinks to kill them.How sri sri takes revenge on them is the rest of the story.
After completing Golden jubilee super star Krishna thought of giving a super success to his fans. His performance is awesome as usual in this movie as a father as well as a angry man who want to kill.He tried to do this movie as his 1st film.there are many standing dialogues in the movie.Vijaya nirmala also acted very well in her character. The scenes in which both are seen came out really well.Senior naresh got a good character as ACP. Sai Kumar once again proved with his acting skills. Murali sharma, posani did their job. Sudheer babu has a small cameo and mesmerised. Director thought of old point but executio  also not so good.Music is not bad. Cinematography os just about ok.Editing should be much better. production values are also good. Graphics and direction should be much better.
Finally there is no comedy in this movie.Those who likes regular films may does not like this film.Those who thinks about society and thinks those problems may like this film.
శ్రీశ్రీ రివ్యూ
 
లా కాల‌జ్ లో లెక్చ‌ర‌ర్ గా పనిచేస్తున్న శ్రీ శ్రీ తన భార్య మరియు కూతురు శ్వేతా తో చాలా ఆనందంగా ఉంటారు. మరోపక్క మీడియా విలేకరిగా పనిచేస్తున్న శ్వేత.. భిక్షపతి మరియు జేకే చేసిన మోసాలను బయట పెట్టడానికి ప్రయత్నిస్తుంటుంది. పోలీస్ లను కలసే లోపు భిక్షపతి మరియు జేకే కొడుకులు ఈమెను దారుణంగా చంపేస్తారు. ఈ ఘోరం గురించి శ్రీ శ్రీ న్యాయశాఖను అభ్య‌ర్థించిన‌ప్ప‌టికీ వారికి ఉన్న రాజకీయ పలుకుబడితో బయటకు వస్తారు. ఇలాంటి పరిస్థుతులలో న్యాయం దొరకకపోవడంతో శ్రీ శ్రీ వారిని చంపివేయాలని నిర్ణయించుకుంటాడు. ఇలా జరిగే నాటకీయ పరిణామాల మద్య శ్రీ శ్రీ తన పగను ప్రతీకారాన్ని ఎలా సాధించుకున్నాడు అన్న‌దే మిగ‌తా క‌థ‌.
గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకున్నకృష్ణ త‌న అభిమానుల కోసం ఓ మంచి క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఎప్ప‌టిలాగే త‌న పాత్ర‌లో త‌ను ఇమిడిపోతూ, త‌న వ‌య‌సుకి తగ్గ పాత్ర‌లో త‌న కూతురు అన్యాయానికి బ‌లైంద‌నే బాధ‌తో ఒక వైపు కుమిలిపోతూ, మ‌రోవైపు చంపిన వారిమీద క‌క్ష్య సాధించే పాత్ర‌లో అద్భుతంగా న‌టించాడు కృష్ణ‌. కొన్ని వంద‌ల సినిమాలు చేసిన కృష్ణ ఇదే త‌న మొద‌టి సినిమాలా ఫీల్ అవుతూ చేసిన‌ట్లు క‌నిపించింది. వ‌య‌సు మీద ప‌డ‌టం వ‌ల‌నో, లేక ఈ వ‌య‌సులో కృష్ణ చేత పంచ్ డైలాగ్ లు చెప్పిస్తే బాగుండ‌ద‌నో మొత్తానికి స్టాండింగ్ డైలాగ్స్ కే ఎక్కువ ప్రాధాన్య‌తనిచ్చారు.విజ‌య నిర్మ‌ల కూడా త‌న స‌హ‌జ న‌ట‌న‌తో మ‌రోసారి ఆకట్టుకుంది. సినిమాలో వీరిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు బాగుంటాయి. ఏసీపీ గా సీనియ‌ర్ న‌రేష్ కు మంచి క్యారెక్ట‌ర్ ప‌డింది. తిరుగుబాటు దారుడు సూర్య‌గా సాయికుమార్ మ‌రోసారి స‌త్తా చాటాడు. ఒక సీన్ లో నరేష్ తో 'తన కుంటి కాలు గురించి చెబుతూ వ్యవస్థే కుంటుతుంది నాదేముంది' అన్న డైలాగ్ బాగుంటుంది. మిగ‌తా పాత్ర‌ధారులు ముర‌ళీ శ‌ర్మ‌, పోసానిలు త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. సినిమా చివ‌ర్లో వ‌చ్చి స్ర్కీన్ మీద వెలుగులు పండించారు సుధీర్ బాబు.
ద‌ర్శ‌కుడు అనుకున్న‌ది పాత పాయింటే అయినా, దాన్ని తెర రూపం దాల్చే విష‌యంలో లోటు పాట్లు క‌నిపించ‌సాగాయి. మ్యూజిక్ ప‌రంగా ప‌ర్వాలేద‌నిపిస్తుంది. సినిమాటోగ్ర‌ఫీ ఓకే. ఎడిటింగ్ ఇంకాస్త బాగా చేసుండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. గ్రాఫిక్స్, డైర‌క్ష‌న్ కి ఇంకొన్ని మెరుగులు దిద్దాల్సింది.
చివ‌రగా.. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వేలెత్తి చూపే ఓ మీడియా యువతిని చంపితే, డబ్బు మదంతో చట్టం ముందు తప్పించుకున్నా శ్రీ శ్రీ 'లా' లో వారికి మరణ శిక్ష అంటూ సూపర్ స్టార్ డిసైడ్ చేసి వారందరినీ చంపేసే ఈ సినిమాలో కామెడీ అసలు ఉండదు.. ఇక రెగ్యులర్ సినిమాలు చూసే వారికి ఈ సినిమా అసలు ఎక్కే అవకాశమే లేదు. సమాజం గురించి అలోచించి ఆ బాధలను అనుభవిస్తున్న వారికి శ్రీ శ్రీ నచ్చే అవకాశం ఉంది.
 

punchline: శ్రీ శ్రీ.., సో సో

 

Filmjalsa Rating: 3/5

 
Thank You


Follow Us