Singam-3 In Nellore


Surya's SINGAM.... This Energetic action movie got so many praises in complete South industry. Tamil Actor Surya's upcoming movie sequel to Singam1 & 2 ,Singam-3 shooting is on sets. Due to Surya's 24 movie release ,he declared break to the shooting for 24 movie promotion. In Singam-3 star heroines Anushka & Sruthi Hassan are sharing screen with Surya. Singam 3 Director Hari is very much confident about this sequel. Main scenes of this film will be shoot in Nellore,Vizag & Hyderabad. Surya & team are planning to release this movie in Telugu & Tamil parallel . Due to their previous series of hit ,Team are hoping this Singam3 too impresses audience of Telugu as well. This is the major reason of Shooting Singam-3 in Telugu States.

నెల్లూరులో సింగం హ‌డావుడి
 
సూర్య క‌థానాయ‌కుడిగా హ‌రి డైర‌క్ష‌న్ లో సింగం-3 తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొంత‌మేర‌కు జ‌రిగాక సూర్య 24 సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డ‌టంతో ఆ సినిమా ప్ర‌మోష‌న్స్ కోస‌మని కొంత విరామాన్ని ప్ర‌క‌టించాడు సూర్య‌. అయితే రేప‌టి నుంచి నెల్లూరులో మొద‌లు కానున్న షెడ్యూల్ లో సూర్య తిరిగి పాల్గొన‌నున్నాడు. కొన్ని ముఖ్య‌మైన స‌న్నివేశాల‌ను నెల్లూరులో చిత్రీక‌రించి, త‌రువాత వైజాగ్, హైద‌రాబాద్ ల‌లో షూటింగ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అనుష్క‌, శృతిహాసన్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. మొద‌టి రెండు పార్ట్స్ విజ‌యం సాధించ‌డంతో, త‌న సినిమాల‌ను తెలుగులోనూ విడుద‌ల చేయ‌డానికి ఆసక్తి చూపుతున్న సూర్య‌, త‌న సినిమాల షూటింగ్ లు తెలుగు రాష్ట్రాల్లో కూడా జ‌రుపుతుండ‌టం విశేషం.