Shekharam Gari Abbayi On 20th October


అచీవర్స్ సిగ్నెచర్ ఎమ్.ఎఫ్ క్రియెషన్స్ బ్యానర్స్ పై  హీరోయిన్ అక్షత దర్శకత్వంలో మద్దిపాటి సోమశేఖర రావు, మధు ఫోమ్రా నిర్మిస్తున్న చిత్రం `శేఖరంగారి అబ్బాయ్`. విన్ను మద్దిపాటి, అక్షత నాయ‌కానాయిక‌లు. అక్టోబర్ 20న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రోమోస్ కు ట్రెమండస్ రెస్పాన్స్ సోషల్ మిడియాలొ వస్తోంది.

ఈ సంద‌ర్బంగా 
దర్శకురాలు, క‌థానాయిక‌ అక్షత మాట్లాడుతూ... శేఖరం గారి అబ్బాయి మ్యూజికల్ ఫ్యామిలీ లవ్ ఎంటర్ టైనర్. మాస్, క్లాస్ అన్న తేడా లేకుండా అన్నీ వర్గాల వారిని ఆకట్టుకునెలా రూపొందించాం. విన్ను నటన ఈ సినిమాకు ఓ హైలెట్.ఈ సినిమాతో ప‌రిచ‌యం అవుతున్న కొత్త‌వారికి, స్ట్ర‌గ్లింగ్ ఆర్టిస్టులు అంద‌రికీ మంచి జ‌ర‌గాలి`` అన్నారు. 

హీరో విన్ను మాట్లాడుతూ.. యూత్ కు నచ్చె, ప్యామిలీ ఆడియెన్స్ మెచ్చె చిత్రమిది. పాటలకు , ట్రైలర్ కు ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్,  ఆశీస్సులు ఉత్సాహాన్నిచ్చాయి. పెద్ద విజ‌యం అందుకుంటామన్నారు .

నిర్మాతలు  మాట్లాడుతూ .. కుటుంబ సభ్యులందరికి నచ్చెలా క్లీన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. హీరోగా  విన్ను కు మంచి గుర్తింపు వస్తుంది. అక్టొబర్ 20న సినిమాను విడుదల చెస్తున్నామన్నారు

కాశీ విశ్వనాధ్,   సూర్య, అనురూప్ ,డి.ఎం.కె  తదితరులు నటించిన ఈ చిత్రానికి  సంగీతం: సాయి ఎలెందర్, కెమెరా: రాఘవ,  కూర్పు: నందమూరి హరి.


Follow Us