Sarainodu Releases On 13th In Malluwood


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఇప్పుడు మరింత పండుగ చేసుకునే అవకాశం ఇచ్చాడు బన్నీ. రీసెంట్ గా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడుతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించాడు. ప్రస్తుతానికి తెలుగులోనే రిలీజ్ అయిన సరైనోడు ఇప్పటికే 70 కోట్ల గ్రాస్ కలక్షన్స్ ను సాధించాడు. అయితే, ఇప్పుడు ఈ నెల 13న మలయాళంలో ఈ సినిమాను 'యోధవ్..ది వారియర్' గా రిలీజ్ చేస్తున్నారు. అసలే మల్లూవుడ్ లో బ‌న్నీని బీభ‌త్స‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. బ‌న్నీ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ చేసిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ సాధిస్తుంది అనడంలో సందేహం లేదు. తెలుగులో ఎంత మార్కెట్ ఉందో అల్లు అర్జున్ కు కేరళలో కూడా అంతే మార్కెట్ పెంచుకున్నాడు. ఈ సినిమాకు ముందు డివైడ్ టాక్ వచ్చినా అవేవి కలక్షన్స్ మీద ప్రభావితం అయ్యేలా చేయలేదు. ఇన్నాళు సొంత బ్యానర్లో తాను సినిమా తీస్తే ఫ్లాప్స్ చవిచూసిన బన్నీ.. ఈ సరైనోడుతో ఆ బ్యాడ్ నేమ్ చెరిపేశాడు. కేవలం బన్నీ స్టామినా మీదే నడుస్తున్న సరైనోడు సినిమా ఈ సమ్మర్లో మొదటి బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి తీరాల్సిందే. మరి కేరళలో ఈ సరైనోడు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి


Follow Us