Sai Dharam Tek- Vv Vinayak's Inttelligent Movie First Look


సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఇంటిలిజెంట్‌'. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు. ఫిబ్రవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 
ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ ''ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ టోటల్‌గా పూర్తయింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. సాయిధరమ్‌తేజ్‌ పెర్‌ఫార్మెన్స్‌, వినాయక్‌ టేకింగ్‌ హైలైట్‌గా ఈ చిత్రం రూపొందింది. సాయిధరమ్‌, వినాయక్‌ కెరీర్‌లో 'ఇంటిలిజెంట్‌' మరో బిగ్గెస్ట్‌ హిట్‌ మూవీ అవుతుంది. అలాగే మా సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌లో మరో కమర్షియల్‌ హిట్‌ సినిమాగా నిలుస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు. 
సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, కాశీ విశ్వనాథ్‌, ఆశిష్‌ విద్యార్థి, షాయాజీ షిండే, రాహుల్‌దేవ్‌, దేవ్‌గిల్‌, వినీత్‌కుమార్‌, జె.పి. ప థ్వీ, రుబాబు, కాదంబరి కిరణ్‌, విద్యుల్లేఖా రామన్‌, సప్తగిరి, తాగుబోతు రమేష్‌, భద్రం, నల్ల వేణు, రాహుల్‌ రామకృష్ణ, వెంకీ మంకీ, రాజేశ్వరి నాయర్‌, సంధ్యా జనక్‌, ఫిష్‌ వెంకట్‌, శ్రీహర్ష, శివమ్‌ మల్హోత్రా, రవిరామ్‌ తేజ, తేజారెడ్డి నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: శివ ఆకుల, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి. విశ్వేశ్వర్‌, సంగీతం: థమన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఫైట్స్‌: వెంకట్‌, డాన్స్‌: శేఖర్‌, జాని, సహనిర్మాతలు: సి.వి.రావు, నాగరాజ పత్సా, నిర్మాత: సి.కళ్యాణ్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌. 


Follow Us