Right Right Movie Review


Handsome hero Sumanth Ashwin has a continuous hits in his career came with his latest movie"Right Right". Sumanth Ashwin came to industry with is father influence who is a star producer MS.Raju. Sumanth Ashwin is impressing with his every movie but he didn't got any star image till now. He is working hard  for that image. Till now he targeted only youth with Tuneega Tuneega, lover's and Kerintha but now he is coming to impress family audience with his latest flick 'Right Right'. Did he succeeded? Is this movie will speedup his career is the main question.
With the death of his father Sumanth Ashwin kept his goal aside and joins as a conductor. Kalakeya Prabhakar is the driver of that bus. They both are very close to the passengers because there is only one bus to that village named 'Gaviti'. Sumanth ashwin falls in love with Pooja Javeri who is a regular passenger in his bus. When everything is going well the son of sarpanch for that village will met with an accident done by his bus. Sumanth and Prabhakar are afraid of case and they will send that boy In another Jeep. But they will found his dead body out side the village. Now Sumanth Ashwin is booked in this case. How did he died and how Sumanth Ashwin escaped from the case is the rest of the story.
This is a remake movie. They selected a good story but failed in executing this film. Director is successful when he did a remake without having any boring element in the movie and also should be interesting to see. The remake movies will get success very rarely. For example Dhabang remake Gabbar Singh and Malayalam Drushyam remake Drushyam type success gets very rarely.
Sumanth Ashwin did a student and some notty characters till now. But for the first time he did selected a tuff character and succeeded. Prabhakar is apt as driver. Heroine has nothing much to do in this movie. Screenplay is very slow. They said this film is a crime thriller but there is no thrilling moment in any scene.
The love Story is also very slow. going to technical aspects cinematography is good. Shekar V Joseph succeeded in picturising village Nativity very well. Going to music we will not even remember single song after the movie. Production values are not bad.
Overall the movie is like diesel less Bus which is saying right right.may be Sumanth career also can't move if he do these kind of movies.

 రైట్ రైట్ మూవీ రివ్యూ

వ‌రుస విజ‌యాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని ఏర్ప‌ర‌చుకున్న హాండ్స‌మ్ హీరో సుమంత్ అశ్విన్ న‌టించిన తాజా చిత్రం `రైట్ రైట్‌`. స్టార్ ప్రొడ్యూస‌ర్ ఎమ్ ఎస్ రాజు వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన సుమంత్ అశ్విన్ మంచి సినిమాల‌తో మెప్పుస్తున్నా, ఒక హీరోగా స్టార్ ఇమేజ్ ను మాత్రం సొంతం చేసుకోలేక‌పోతున్నప్ప‌టికీ, త‌న ప్ర‌య‌త్నాల్ని మాత్రం కొన‌సాగిస్తూనే ఉన్నాడు. తూనీగా.. తూనీగా, ల‌వ‌ర్స్, కేరింత సినిమాల‌తో యూత్ ని మాత్ర‌మే టార్గెట్ చేసిన సుమంత్ ఈసారి రైట్ రైట్ తో ఫ్యామిలీ ఆడియ‌న్స్ ను టార్గెట్ చేయ‌డానికి ట్రై చేశాడు. మ‌రి త‌న ప్ర‌య‌త్నం విజ‌య‌వంతం అయిందా? రైట్ రైట్ సినిమా త‌న కెరీర్ కు స్పీడ్ పెంచుంతుందో లేదో అన్న‌దే ఇప్పుడు ప్ర‌శ్న‌.
తండ్రి మ‌ర‌ణంతో త‌న క‌ల‌ను ప‌క్క‌న పెట్టి కండ‌క్ట‌ర్ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు సుమంత్ అశ్విన్. త‌ను ప‌నిచేసే బస్ డ్రైవ‌ర్ గా కాల‌కేయ ప్ర‌భాకర్ ఉంటాడు. గవిటి అనే ఊరికి వెళ్లేది ఒక్క బ‌స్సే కావ‌డంతో వీళ్లిద్ద‌రూ, ఊరి జ‌నాల‌కు బాగా ద‌గ్గ‌ర‌వుతారు. ఈ తరుణంలోనే ఆ బ‌స్ లో రెగ్యుల‌ర్ వ‌చ్చే పూజా జ‌వేరి తో సుమంత్ అశ్విన్ ప్రేమలో ప‌డ‌తాడు. అంతా ప్ర‌శాంతంగా సాగుతున్న స‌మ‌యంలో వీళ్ల బ‌స్ కింద ఆ ఊరి సర్పంచ్ గార‌బ్బాయి ప‌డి గాయ‌ప‌డ‌తాడు. కేసు అవుతుంద‌న్న భ‌యంతో వేరే జీపు డ్రైవ‌ర్ కి అప్ప‌గించి అక్క‌డి నుంచి వెళ్లిపోతారు సుమంత్, ప్ర‌భాక‌ర్ లు. కానీ వీళ్లు జీపులో ఎక్కించి పంపించిన స‌ర్పంచ్ గార‌బ్బాయి ఊరి బ‌య‌ట లోయ‌లో శ‌వ‌మై క‌నిపించ‌డంతో నేరం సుమంత్ అశ్విన్ మీద ప‌డుతుంది. అస‌లు ఆ స‌ర్పంచ్ గారి అబ్బాయి ఎలా చ‌నిపోయాడు, ఆ నేరం నుంచి సుమంత్ ఎలా బ‌య‌ట ప‌డ్డాడు అన్న‌దే మిగ‌తా క‌థ‌.
తెలుగులో క‌థ‌లు లేన‌ట్లు వేరే భాష నుంచి కాపీ కొట్ట‌డం మ‌న టాలీవుడ్ కే చెల్లింది. మంచి క‌థ‌ను కాపీ కొట్టారు స‌రే దాన్ని ప్రేక్ష‌కుల‌కు బోర్ కొట్టించ‌కుండా, చూసే ప్ర‌తి ఒక్క‌రికీ ఆస‌క్తి క‌రంగా తీర్చిదిద్దిన‌ప్పుడే డైర‌క్ట‌ర్ అనేవాడు స‌క్సెస్ అయినట్లు. దాన్ని వ‌దిలేసి ఏదో స్టోరీ తెచ్చేసుకున్నాం, అక్క‌డ ఎలాగో హిట్ అయింది క‌దా, అది ఎలా ఉందో అలాగే మ‌నం కూడా తీస్తే హిట్ అవుతుంది అనుకునే ఆలోచ‌న‌లు మ‌న వాళ్లు ఎప్పుడు మానుకుంటారో మ‌రి. వేరే భాష నుంచి రీమేక్ చేసిన సినిమాలు ఎప్పుడో ఒక‌సారే విజ‌యం సాధిస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు ద‌బాంగ్ రీమేక్ చేసి గ‌బ్బ‌ర్ సింగ్, మ‌లయాళ దృశ్యం రీమేక్ దృశ్యం లాంటి అద్భుతాలు అప్పుడ‌ప్పుడే జ‌రుగుతాయి అన్న విష‌యం ఎందుకు అర్థ‌మ‌వదో వీళ్ల‌కి.
ఇప్ప‌టివ‌ర‌కు చిలిపి ప‌నులు, అల్ల‌రి చేసే పాత్ర‌ల్లోనే క‌నిపించిన సుమంత్ అశ్విన్ మొద‌టిసారి ఒక బ‌ల‌మైన పాత్ర‌ను ఎంచుకుని విజ‌యం సాధించాడు. డ్రైవ‌ర్ గా ప్ర‌భాక‌ర్ బాగా సెట్ అయ్యాడు. అస‌లు హీరోయిన్ ఉంది అంటే ఉంది అన్న‌ట్లే త‌న క్యారెక్ట‌ర్ ప‌రంగా పెద్ద‌గా స్కోప్ లేదు. ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణంలో సాగే ఈ క‌థ‌కు చిన్న క్రైమ్ సీన్ ఒక‌టి యాడ్ చేసిన ప్ర‌య‌త్నం బాగున్న‌ప్ప‌టికీ, స్క్రీన్ ప్లే కొంచెం స్పీడ్ పెంచాల్సింది. సినిమా మొద‌లు పెట్టిన ద‌గ్గ‌ర నుంచి క్రైమ్ థ్రిల్ల‌ర్ అని చెప్పుకుంటూ వ‌చ్చిన ఈ సినిమాలో థ్రిల్ అనిపించే అంశం ఒక్క‌టీ ఉండ‌క‌పోవ‌డంతో పెద్దగా కిక్ అనిపించ‌దు.
దీనికి తోడు ఉన్న కాస్త ల‌వ్ స్టోరీ అయినా స‌రిగా ఉందా అంటే చాలా నెమ్మ‌దిగా క‌థ న‌డుస్తుంది. సాంకేతిక నిపుణుల ప‌రంగా చెప్పాలంటే సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. పల్లె వాతావ‌ర‌ణాన్ని అందంగా చూపించ‌డంలో శేఖ‌ర్ వి జోసెఫ్ సక్సెస్ అయ్యాడు. ఇక మ్యూజిక్ గురించి చెప్పాలంటే అస‌లు ఏ పాటా గుర్తుండ‌దు. నిర్మాణ విలువ‌లు ఫ‌ర్వాలేదు.
ఓవ‌రాల్ గా డీజిల్ లేని బ‌స్ ను రైట్ రైట్ అని ఎంత‌మంది అరిచినా ఎలా ఊపందుకోదో, ప్ర‌భాక‌ర్ తో క‌లిసి రైట్ రైట్ అన్నా సుమంత్ కెరీర్ కూడా స్పీడ్ అందుకునేలా లేదు.

Punch Line : ''Right..Right'' HoldOn HoldOn

FilmJalsa Rating : 2.25/5


Follow Us