Review: Supreme " Dont Sound Horn "


Review: Supreme " Dont Sound Horn "

SUPREME COOL BREEZE ENTERTAINER IN THIS HOT SUMMER 'supreme' has a routine story with action drama & comedy. The Audience say's Director Anil Ravupudi's Screenplay makes the movie intresting & worth watching. Anil Ravupudi's directorial debut was 'pataas' which gave a commercial hit. His second film "supreme" tagline “Don’t Sound Horn” has been making news at box office as director frame one more commercial hit in his record. Although the characters in first half has been revealed ,director made sure that their is no lag of entertainment & story line. Story was predictable after first half and Entertainment was carried out through out the movie till ending. "MEGA FAMILY " having endless records at box office for their energetic action & they carry audience pulse with the name itself. 'Sai Dharam Tej' brighten up the name MegaFamily and flatter the audience with his performance ,mass appearance ,dance and comedy. He improvised his performance in supreme than his previous movies. RashiKhanna paired with SaiDharamTej.Though her character does'nt weigh much she tangled audience with her glamour and comedy. Heroine played the role of SI, where director designed comedy angle with cop's character. This comedy sequence is much more familiar with directorial debut 'Pataas' movie as it turns heads up to director's deliberation towards Police character. 'Vennela Kishore ' & ' RashiKanna' played major role in comedy corner. The diaogues between these two "OTTU ANTE MAMULU OTTU KADHU BAHUBALI OTTU" brace the audience. 'Tanikela bharani' entertained with his humor as he gets hospitalized by having poisonous sweet. 'Kabir Singh ' and 'Ravi kishan' did justice to the villain's character's. Both villain's are from bollywood and it would be much more appreciatable to director if he had choosen any from our 'TFI' as we are having number of talented actors. SaiDharamTej plays the role of a Cab Driver-Balu. He extremely carried out the tag line "Do not sound horn" line till end of the movie as it is co-related at the tereminus point of story as he save's the child at crucial edge. 'Mikhel Gandhi' the boy RAJAN an Anglo Indian of 8year's old, who showdown's entire story with his cuteness ,dialogue delivery and expressions. He first gets interacted with Hero by being a little Krishna(thief) and gets attached to him followed by the story. when hero shows sympathy towards him as 'he lost his parents in very young age' the scene between hero and the kid take off the sentiment corner. Rajan got very impressive dialogues like " NANNU CHUSI JAALIPADAKU NAKU ISHTAM UNDADU" , " NAA RAJYAM LO PRAJALU KASHTALLO UNTE NENU CHUDALENU" , " NENU KASHTAPADE THINTA..NEELA KADHU . Audience awe at the scene where the little boy's statement changes Rajendra prasad's habit towards drinking and becoming a responsible person in the society . There where some more spellbind scenes and dialogues of Rajan "NAA SKIN TONE WHITE KAVOCHU KANI NAA BLOOD INDIAN" , the way he carries his father's liability's from all over UK. Second half of the story was dragged a little,but director fullfill's it with emotionally connected scene of physically challenged people , who save's the kid and fight with villain Ravi kishan. music minim average score, but the re-recording part was toted well. ANDAM HINDOLAM remake song is the high light of the film. Few more characters in the film whose appearence was occassional but elevate dominant performance from the begining to end. 'Amrutham siva narayana ' who always asks for coffee in infrequent times in between the film. Hilarious comedy by 'Prudhvi','prabhas sreenu' as they were vallet thief's and 'posani krishna murali ' & 'srinivas reddy'(seenayya-annaya) as musicians they create funny blog in between hero and villain's while they are fighting. Best supporting roles by 'SaiKumar' as 'Narayana Rao' and 'Rajendra Prasad' as Hero's father character. RaghuBabu,Tanikella Bharani,Murali Mohan and others did satisfy their roles. cinematography is also one of the best part in the movie's success. Editing needs to be improvised in some scenes,apart from that it was a clear cut film. "Sri Venkateswara creations added one more superb story in it's nest.
At last SUPREME : WOW.....IT'S AMAZING...ZING ZING FILM JALSA RATING =  3.25/5
 
సుప్రీమ్.. ఈ ఎండ‌ల‌కు సేద‌తీర్చే మంచి కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చినా , కొత్తదనం తో ఉన్న స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రేక్షకులని బాగా ఇంప్రెస్ చేశాడు. తన మొదటి సినిమా “ప‌టాస్” తోనే మంచి సినిమా తీశాడు అనిపించుకున్న ఈయన ఈ సినిమాతో మ‌రోసారి కమర్షియల్ సక్సెస్ కొట్టాడు .స్టోరీలో ఉన్న క్యారెక్ట‌ర్స్ మొత్తం ఫ‌స్టాఫ్ లోనే రివీల్ చేశాడు ద‌ర్శ‌కుడు. కానీ స్టోరీ లైన్ ను మాత్రం లాస్ట్ లోనే చెప్పాడు. ఆల్రెడీ రివీల్ అయింది క‌దా స్టోరీ అని బోర్ కొట్టించే దిశ‌గా క‌థ సాగ‌కుండా ఫ‌స్టాఫ్ లో బాగానే నెరేట్ చేసుకున్నాడు.
మెగా కుటుంబం నుంచి బాక్సాఫీస్ కు హీరో వ‌స్తున్నాడు అంటే ఖ‌చ్చితంగా మంచి న‌ట‌న‌, డ్యాన్సులు తమ అభిమానులు ఊహించుకోవ‌డం కామ‌న్. ఆ విష‌యంలో సాయిధ‌ర‌మ్ తేజ్ నూటికి నూరు మార్కులు కొట్టేశాడ‌ని చెప్పొచ్చు.త‌న గ‌త సినిమాల కంటే ఇంకొంచెం మెరుగ్గా త‌న న‌ట‌నతో మెప్పించాడు. రాశీఖ‌న్నాపాత్రకు అంత‌గా ప్రాధాన్యం లేకపోయినా త‌న గ్లామ‌ర్ తో క‌ట్టిప‌డేసింది. మొద‌టి సినిమా ప‌టాస్ లోనూ పోలీస్ పాత్ర‌తో కామెడీ చేయించ‌డం, ఈ సినిమాలో రాశీఖ‌న్నాతో కామెడీ చేయించ‌డం చూస్తుంటే అస‌లు డైర‌క్ట‌ర్ కి పోలీస్ క్యారెక్ట‌ర్ అంటే ఇష్ట‌మా..? సెంటిమెంటా.. ?కోప‌మా..? ఒకానొక సంద‌ర్భంలో కేవ‌లం కామెడీ కోసమే రాశీఖ‌న్నా పాత్ర‌ను క్రియేట్ చేసిన‌ట్ల‌నిపిస్తుంది.
పోలీస్ కానిస్టేబుల్ గా వెన్నెల కిషోర్ మెప్పించాడు. రాశీఖ‌న్నాతో ''ఒట్టు అంటే మామూలు ఒట్టు కాదు బాహుబ‌లి ఒట్టు'' అంటూ వచ్చే సీన్ బాగా పండింది. త‌నికెళ్ళ భ‌ర‌ణితో విషం క‌లిపిన పాయ‌సం తినిపించే సీన్లో కామెడీ బాగుంది.
విల‌న్ గా క‌బీర్ సింగ్ బాగా చేశాడు. కానీ విల‌న్ విష‌యంలో అంద‌రికీ ఎక్క‌డో వెలితి.... హీరో మ‌న తెలుగు వాడైన‌ప్ప‌టికీ విల‌న్ గా న‌టించిన క‌బీర్ సింగ్, ర‌వికిష‌న్ ఇద్ద‌రూ బాలీవుడ్ వాళ్లే. మ‌న తెలుగులో ఇంత‌కంటే మంచి విల‌న్లు లేరా.., ఎక్క‌డినుంచో తెచ్చి పెట్టుకోడానికి అనే కోణంలో నుంచి వ‌చ్చిన బాధ సారాంశం ఇది...
ట్యాక్సీ డ్రైవ‌ర్ గా ప‌నిచేసే సాయిధ‌ర‌మ్ తేజ్ కు త‌ను డ్రైవింగ్ లో ఉన్న‌ప్పుడు వెనుక‌నుండి ఎవ‌రైనా హార‌న్ మోగిస్తే త‌నకు కోపం రావడం ఫ‌స్టాఫ్ లో ఏదో టైమ్ క‌లిసిరావ‌డానికి కాసేపు స‌ర‌దాగా పెట్టాడ‌న‌కుంటాం కానీ.. దానికి సెకండాఫ్ లో పిల్లాడిని ర‌క్షించే సీన్ కు ఈ సీన్ సింక్ చేయ‌డం బాగుంది.
ఇక అస‌లు సినిమాలో చెప్పుకోద‌గ్గ క్యారెక్ట‌ర్ రాజ‌న్(మిఖైల్ గాంధీ) అనే ఎనిమిదేళ్ల బాబు. ఒక దొంగ కృష్ణుడులా వ‌చ్చి, ఆంగ్లో ఇండియ‌న్ లా ముద్దు ముద్దుగా మాట్లాడి అందిరి మ‌న‌సులు దోచేసుకుంటాడు. చిన్న వ‌య‌సులోనే త‌ల్లిదండ్రుల‌ను పోగొట్టుకుని, అనాథ‌లా ఉంటున్న రాజ‌న్ ను చూసి హీరో జాలి ప‌డ‌గా.. జాలిప‌డ‌కు నాకు ఇష్టం ఉండదు అనే సీన్ బావుంది. నేను క‌ష్ట‌ప‌డి సంపాదించే తింటా.. నీలా కాదు అని రాజేంద్ర‌ప్ర‌సాద్ ని అన‌గానే.. అప్ప‌టివ‌ర‌కు తాగుబోతుగా ఉన్న రాజేంద్ర‌ప్ర‌సాద్ మారే సీన్ బాగుంది. నా రాజ్యంలో ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉంటే నేను చూడ‌లేను అని రాజ‌న్ చెప్పే డైలాగ్ ఆడియ‌న్స్ కు బాగా న‌చ్చుతుంది. సెకండాఫ్ లో కథ కొంచెం సాగ‌దీస్తున్నాడు అనే టైమ్ లో విక‌లాంగులు పిల్లాడిని ర‌క్షించే ఫైట్ తో ప్రేక్ష‌కులు కుర్చీకి అతుక్కుపోతారు. తండ్రి ఆశ‌యం కోసం పిల్లాడు ప‌డే క‌ష్టం, పిల్లాడ్ని కాపాడ‌టం కోసం దానికి అనుగుణంగా వ‌చ్చే సీన్స్ అన్నీ బాగున్నాయి. నా స్కిన్ టోన్ వైట్ అవొచ్చు కానీ నా బ్ల‌డ్ ఇండియాదే అని రాజ‌న్ చెప్పే డైలాగ్ కి ఒళ్లు గ‌గూర్పొడుస్తుంది. పాట‌లు ఫ‌ర్వాలేద‌నిపించినా.. రీరికార్డింగ్ బాగుంది. అమృతం శివ‌న్నార‌య‌ణ‌ అస‌లు ప్ర‌పంచంతో త‌న‌కేం సంబంధం లేన‌ట్టు అస్త‌మానం కాఫీ అడ‌గ‌టం బాగా న‌వ్వు తెప్పిస్తుంది. అందం.. హిందోలం అనే పాట లో సాయి, రాశీల డ్యాన్సులు బాగున్నాయి.ఈ పాట‌లో మెగాస్టార్, ప‌వ‌ర్ స్టార్ వాళ్ల‌తో సుప్రీమ్ స్టార్.. ముగ్గురు ఒకేసారి తెర‌పై క‌నిపించ‌డం మెగా అభిమానుల‌కు పండుగలానే అనిపిస్తుంది. కారు దొంగ‌లుగా పృథ్వీ,ప్ర‌భాస్ శ్రీను కామెడీ టైమింగ్ సూప‌ర్. స‌న్నాయి విధ్వాంసుల పేరుతో హీరో విల‌న్స్ ని కొట్టే సీన్స్ పటాస్ లో పార్ధాయ సాధూనాం అనే ట్రాక్ ని త‌ల‌పిస్తుంది. అలాగే శీన‌య్య‌-అన్న‌య్య అనే క్యారెక్ట‌ర్స్ లో పోసాని, శ్రీనివాస‌రెడ్డి సామాన్యుల ముందు మా స‌న్నాయి మోగ‌దు అంటూ వాళ్లు చెప్పే డైలాగ్ బావుంటుంది. నారాయ‌ణ‌రావు పాత్ర‌లో సాయికుమార్ బాగా చేశాడు. హీరో తండ్రిగా రాజేంద్ర‌ప్ర‌సాద్ న‌టించిన‌ప్ప‌టికీ అత‌ని పాత్ర‌కు పెద్ద‌గా స్కోప్ లేదు. మంచి క‌థ‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా ఉన్న శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్ బాగున్నాయి. సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు ప్ల‌స్. ఎడిటింగ్ బాగున్న‌ప్ప‌టికీ, అక్క‌డ‌క్క‌డా ఇంకొంచెం క‌త్తెర ప‌డితే బాగుండేద‌నిపిస్తుంది. ర‌ఘుబాబు, త‌నికెళ్ల భ‌ర‌ణి,స‌త్యం రాజేష్, ముర‌ళీ మోహ‌న్ త‌మ త‌మ పాత్ర‌ల్లో బాగానే చేశారు. చివ‌ర‌గా.. సుప్రీం గురించి చెప్పేదేంటంటే.. WOW.. IT'S AMAZING.. ZING..ZING Film Jalsa Rating  :  3.25/5


Follow Us