''rayudu'' Movie Review


South Star Hero Vishal as Rayudu...

Rayudu is a complete Mass movie...It's been released in both Kolly wood & Tolly wood. In Tolly wood Rayudu is released today.Once again Vishal proved that he can bind up in any character so lively with this film. A story which revolves around in a market of Anantapuram ,where Vishal is a daily porter. Vishal's character in Rayudu is very simple & eady-going. Rayudu have three main characters in it. " Hero , Hero Grand mother & Villain ". First of the film will be completely about Vishal . his Granny & love track with heroine SriDivya. Discussing about First half of the film.... Vishal is a daily porter in a normal market at Anantapur.His granny rise him up after his parents death. He lives a simple life,suddenly one day granny asks vishal to marry SriDivya. Love track between SriDivya & Vishal will be in first half & why Granny asks Vishal to marry only SriDivya will be revealed next. SriDivya's appearence is completely D-Glamorous & she gave her best in acting like a village girl. Main lead Vishal's grand mother too gave her best acting in the film it is very natural & close to heart. Actor Suri who entertains with his Kokarako role through out entire film & set tears at ending. Coming to the point of Villain...In this type of Mass movies Villain should be more violent ,Radha Ravi as Bhairavudu & Suresh as Rolex Bachi gave their best in presenting Villain's role. AAdira lakshmi didn't have lengthy role in the film,but performed very well as Karate Bhanumathi. Other characters in the film are so-so with their roles. Complete first half will be on Love track & Sentiments ,Emotions scenes between Grand son & granny,But the twist before Interval creates a little suspence . Second half will continue with interval's suspence & war between hero & villains. Music part is average & creates boredom .It takes movie in a slow track. Generates good feeling when the movie is around pure village and the scenes ,their living will impress u for sure. Rayudu is a simple old story with one hero,villain & hero's winning on villain. This is a old simple concept ,which is known to director as well.if there would be more twists in the film it would be interesting for audience. We Telugu people are very much habituated to watch colorful environment in the film. Due to pure Kolly wood nativity & actors Telugu people might feel little bore . Background music is very well & matches to the scenes,Editing is okay & there area more chances to take care in this part. Screen play too boring through out the movie,so screenplay part got failed to attract audience. At last Rayudu is a complete Mass story.If you are done with all the moves out in market & Rayudu is in choice ,then you can watch. If you want to go with your family to complete family entertainer's than it will be little difficult to watch Rayudu.
రాయుడు సినిమా రివ్యూ
అనంత‌పురం మార్కెట్ యార్డ్ లో మూట‌లు మోస్తూ సాదాసీదా జీవితాన్ని గ‌డిపే విశాల్ చిన్న‌త‌నంలోనే అమ్మ‌, నాన్న‌ల‌ను పోగొట్టుకోవ‌డంతో త‌న అమ్మ‌మ్మ ద‌గ్గ‌రే పెరిగి పెద్ద‌వాడ‌వుతాడు. అమ్మ‌మ్మ కోసం ఏమైనా చేసే మ‌న‌స్త‌త్వం విశాల్ ది. జీవితం సాఫీగా సాగుతున్న స‌మ‌యంలో శ్రీదివ్య ను పెళ్లి చేసుకోమ‌ని కోరుతుంది విశాల్ అమ్మమ్మ‌. శ్రీదివ్య‌నే పెళ్లి చేసుకోమ‌ని చెప్ప‌డానికి గ‌ల కార‌ణాలేంటి.. ఆ నేప‌థ్యంలో విశాల్ ఎదుర్కొన్న స‌మ‌స్య‌లేంటి అన్న‌దే క‌థ‌.
సినిమా మొత్తం విశాల్ మ‌రియు త‌న‌ అమ్మ‌మ్మ చుట్టూనే తిరుగుతుంటుంది. విశాల్ మాస్ హీరోగా మ‌రోసారి నిరూపించుకున్నాడు. సినిమాలోని త‌న ఆవేశం, ఎనర్జీ లెవ‌ల్స్ ఎక్స్‌ట్రార్డిన‌రీ. యాక్ష‌న్ సీన్స్ లో ఎమోష‌న్స్ బాగా కారీ చేశాడు. ప‌ల్లెటూరి అమ్మాయిగా శ్రీదివ్య త‌న లుక్స్ తో జీవించేసింది. మేక‌ప్ లేకుండా డీ గ్లామ‌ర్ గా ఆమె చేసిన పాత్ర అంద‌రినీ అల‌రిస్తుంది. సినిమాలో ముఖ్య‌పాత్ర పోషించిన విశాల్ అమ్మ‌మ్మ ఈ పాత్ర‌కి త‌న నాచుర‌ల్ న‌ట‌న‌తో అందం తీసుకొచ్చింది. అలాగే కొక్కొరొకే అనే పాత్ర‌లో సినిమా మొత్తం న‌వ్వించి క్లైమాక్స్ లో ఏడిపించిన సూరి పాత్ర సినిమాకు పెద్ద ప్ల‌స్ అనే చెప్పుకోవాలి. ఇక‌పోతే రాయుడు వంటి మాస్ సినిమాలో విల‌న్స్ ఎంత వైలెంట్ గా ఉంటే యాక్ష‌న్ సీన్స్ అంత బాగా పండుతాయి. ఈ చిత్రంలో విల‌న్స్ భైర‌వుడు, రోలెక్స్ బాచి పాత్ర‌ల‌తో మంచి న‌ట‌న క‌న‌బ‌రిచారు రాదా ర‌వి, సురేష్. క‌రాటే భానుమ‌తిగా ఆదిరా ల‌క్ష్మి కొంచెం సేపే క‌నిపించిన‌ప్ప‌టికీ త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. మిగ‌తా పాత్రల‌న్నీ సోసో గా ఫ‌ర్వాలేద‌నిపించారు.
ఫ‌స్టాఫ్ మొత్తం ల‌వ్ ట్రాక్, బామ్మ వ్యవ‌హారాల‌తో.. అక్క‌డ‌క్క‌డా చిన్న చిన్న ఫైట్స్ తో సాగిపోతుంది. ప‌ల్లెటూరిలో వుండే ప్ర‌తి ఒక్క‌రూ ఎలా ఉంటార‌న్న అంశాన్ని బాగా చూపించాడు. ఉన్న ఒక‌టి రెండు పాట‌లు ఫ‌ర్వాలేద‌నిపించినా మ‌ధ్య‌లో వ‌చ్చి బోర్ కొట్టిస్తాయి. అక్క‌డ‌క్క‌డా సీన్స్ సాగ‌దీసిన‌ట్లు అనిపిస్తుంది. ఇంట‌ర్వెల్ కి ముందు వ‌చ్చే ఎపిసోడ్ కొంచెం ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ఇంట‌ర్వెల్ మాత్రం ఒక అనూహ్య ట్విస్ట్ తో ముగుస్తుంది.
ఫ‌స్టాఫ్ లో వ‌చ్చిన ట్విస్ట్ తోనే చాలాసేపు వ‌ర‌కు సెకండాఫ్ లో క‌థ కంటిన్యూ అవుతుంది. త‌ర్వాత మొత్తం హీరోకి, విల‌న్ కి మ‌ధ్య ఉండే సీన్లే ఉన్నాయి. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ ఎటువంటి ట్విస్ట్ లు లేకుండానే ముగియ‌డంతో ప్రేక్ష‌కులు నిరుత్సాహ‌ప‌డ‌తారు. ప్రీ క్లైమాక్స్ లో వ‌చ్చిన సెంటిమెంట్ సీన్ అంద‌రినీ క‌దిలిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ఒక విల‌న్, ఆ విల‌న్ ని అణిచివేయడానికి ఒక హీరో, అప్పుడ‌ప్పుడు నాలుగు ఫైట్లు, సెంటిమెంట్స్, హీరోహీరోయిన్ల మ‌ధ్య ల‌వ్ ట్రాక్, కామెడీ అంతా మామూలే. ఒక్కమాట‌లో చెప్పాలంటే పాత చింత‌కాయ‌ప‌చ్చ‌డినే తిర‌గ‌తొక్కాడు డైర‌క్ట‌ర్. పాట‌లు సినిమాని బాగా స్లో చేస్తాయి. మ‌నం మొద‌టి నుంచి తెలుగు సినిమాలు క‌ల‌ర్‌ఫుల్ గా చూడ‌టం వ‌ల‌నో లేక సినిమా మొత్తం త‌మిళ నేటివిటీతో సాగుతుండ‌టం వ‌ల‌నో కానీ తెలుగు ఆడియ‌న్స్ కి విసుగు, ఒకింత బోర్ ఫీల్ అవుతారు. కానీ, మ‌హిళ‌ల‌కు ఉండాల్సిన తెగువ‌, తెగింపు గురించి ఈసినిమాలో బాగా చూపించాడు.
గ్రామీణ వాతావ‌ర‌ణాన్ని చూపించ‌డంలో సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. సంగీత పరంగా పాట‌లు బాగాలేన‌ప్ప‌టికీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం స‌న్నివేశాల‌కు తగ్గ‌ట్టు ఉంది. ఎడిటింగ్ ఫ‌ర్వాలేద‌నిపించింది కానీ అక్క‌డ‌క్క‌డా కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్ల‌యితే బాగుండేది. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ ఓకే. ద‌ర్శ‌కుడి గురించి చెప్పాలంటే త‌ను ఎంచుకున్న స్టోరీ లైన్ పాత‌ది అని అత‌ని కూడా తెలుసు. దానికి ట్విస్ట్ లు యాడ్ చేసిన‌ట్ల‌యితే బాగుండేది. స్క్రీన్ ప్లే కూడా చాలా బోరింగ్ గా ఉండ‌టంతో ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకోవ‌డంలో ఫెయిల్ అయ్యాడు.
చివ‌ర‌గా ఒక రొటీన్ మాస్ మ‌సాలా చిత్రాన్ని చూడాల‌నుకునేవారు, ప్రస్తుతం అన్ని సినిమాలు చూసి ఇదొక్క‌టే చూడాలి అనుకునే వారు వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ సినిమాలు, వారానికి ఒక‌సారైనా సినిమాకి వెళ్లేవారు వెళ్తే ఇబ్బంది ప‌డ‌తారు.
 
filmjalsa Rating: 3/5
 Thank You


Follow Us