Rajinikanth Is All That You Need To Watch Out For : Kabali Teaser


సౌత్ సూపర్ స్టార్ రజిని మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు. రంజిత్ దర్శకత్వంలో కబాలిగా రాబోతున్న రజినికాంత్ ఈ సినిమాలో మాఫియా డాన్ గా కనిపించనున్నారు. నిన్న రిలీజ్ అయిన తెలుగు, తమిళ టీజర్ కు అందరు మరోసారి దట్ ఈజ్ తలైవా అనేలా చేశాడు రజిని. తనకు మాత్రమే సొంతమైన స్టైల్ తో టీజర్ లోనే సినిమా చూపించేశాడు. మిడిల్ ఏజ్ లుక్ తో గడ్డంతో రజిని లుక్ నిజంగా అదరగొట్టేస్తుంది. సంతోష్ నారాయణన్ సంగీతం ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్  చితక్కొట్టేశాడు. రాధికా ఆప్టె హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాతో రజిని మరోసారి తన స్టామినా చూపించబోతున్నారు.‘‘ఎవడ్రా ఆ కబాలి.. రమ్మని చెప్పురా’’ అంటూ విలన్ అంటే..‘‘కబాలి అంటే తమిళ సినిమాల్లో లాగా బొట్టు పెట్టుకుని.. లుంగీ కట్టుకుని.. కబాలి అని పిలవగానే వచ్చి నిలబడి చెప్పన్నా అనే టైపనుకున్నావారా..’’ అంటూ కౌంటర్ ఇచ్చి.. ‘కబాలి...రా’ అంటూ తనదైన స్టయిల్లో డైలాగ్ చెప్పి అదరగొట్టాడు రజినీకాంత్. ఈ నెల మూడో వారంలో ఆడియో రిలీజ్ చేసుకోబోతున్న కబాలి.. జూన్ నెలలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవకాశాలు ఉన్నాయి. విక్రమ సింహా, లింగా సినిమాల ఫ్లాపులతో అపవాదాలు మూటకట్టుకున్న రజిని ఈ కబాలితో వాట‌న్నింటినీ అధిగమించాలని గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్నాడు. టీజర్ చూస్తుంటే సినిమా రికార్డుల సునామి సృష్టించడం ఖాయం అనిపించేస్తుంది. ఇప్పటికే ఈ టీజర్ చూసిన సిని ప్రముఖులు చిత్రయూనిట్ మీద రజిని మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. watch Kabali Telugu  Teaser https://www.youtube.com/watch?v=HfRQOc9WgnY