Puri Gift To Ntr Fans


పూరీ జ‌గ‌న్నాధ్.. టాలీవుడ్ లో డేర్ అండ్ డాషింగ్ డైర‌క్ట‌ర్. జ్యోతిల‌క్ష్మి, లోఫ‌ర్ చిత్రాల త‌ర్వాత రోగ్ అనే సినిమాను రిజిస్ట‌ర్ చేయించిన‌ప్ప‌టికీ దాన్ని షెడ్యూల్ వ‌ర‌కు తీసుకెళ్ల‌లేదు. లోఫ‌ర్ త‌ర్వాత డిస్ట్రిబ్యూట‌ర్ల వివాదం పూరీ ఇమేజ్ కు బాగా నే దెబ్బ త‌గిలింది. దీంతో వ‌రుస‌గా స్టార్ హీరోల‌తో సినిమాలు అనౌన్స్ చేస్తూ నా రేంజ్ నాకుంది అంటూ త‌న‌ను తాను ప్ర‌మోట్ చేసుకుంటున్నాడు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, జూ.ఎన్టీఆర్ కు ఒకే రోజు క‌థ‌లు చెప్పి ఓకే అనిపించుకున్న పూరీ.. మొన్న ఈ మ‌ధ్యే క‌ళ్యాణ్ రామ్ సినిమాకు అధికారికంగా పూజా కార్యాక్రామ‌లు కూడా జ‌రిగాయి. అయితే చేతిలో ఉన్న ప్రాజెక్టు పూర్తి అయ్యాక క‌ళ్యాణ్ రామ్ సినిమాను పూరీ ప్రారంభించ‌నున్నాడు. ఇదిలా ఉండ‌గా.. ఈనెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా డీటైల్స్ అనౌన్స్ చేయాలని ప్లాన్ చేశాడట పూరీ. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గ్యారేజ్ ఫస్ట్ లుక్ తో పాటు ,పూరీ మూవీ డీటెయిల్స్ డ‌బుల్ ధ‌మాకా అన్న‌మాట‌.