Pawan Tweet For Special Status


వ‌రుస ట్వీట్లతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కాక పుట్టించిన జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ సినీ హీరో పవన్ కల్యాణ్ ఏపీకి ప్రత్యేక హోదాపై ఘాటుగా స్పందించారు. ఈ మేరకు పవన్ ఒక ట్వీట్ చేశారు. 'ప్రత్యేక హోదాపై ఇచ్చిన మాటను కేంద్రం నిలబెట్టుకోవాలి, సీమాంధ్ర ప్రజల నమ్మకాన్ని బీజేపీ వమ్ముచేయదని ఆశిస్తున్నా'నని అన్నారు. పార్లమెంటులో ఎంపీలను బయటకు గెంటి రాష్ట్రాన్ని విభజించి, కాంగ్రెస్ ఘోర‌మైన త‌ప్పు చేసింద‌ని, బీజేపీ అలాంటి త‌ప్పు చేయ‌కుండా.. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఉద్యమించేలోపే మన అధికార, ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ లో ప్రత్యేక హోదాపై పోరాటం చేయాలని పవన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.


Follow Us