Okka Ammayi Thappa Review


After a long wait of nearly seven years in Industry director Raja Simha finally done with his  movie 'Oka Ammai thappa' with the real incident which he faced in his own life which released today all over the world.
Krishna vachan(Sundeep Kishan) is a guy who play mind games in his real life get stuck in a traffic jam on a flyover for eight hours.He met a girl (Nithya Menon) on the fly over who is his childhood friend and fell in love. Suddenly twist in the tale arrives that there is a bomb on the fly over kept by Anwar(Ravi Kishan). Why the bomb is placed on fly over, what happens to the Sundeep Kishan love story, how did he overcome with all this situations he faced is the rest of the story.
Positive points:
Undoubtedly Sundeep Kishan is the main plus point of this film. The way he acted in this film will be impressed by everyone, Nithya Menon performance is also one of the major highlights of the film. The way director narrated the story  is impressive. The Screenplay in second half is effective. The BGM given by Micky J Mayer took the movie to another level. The cinematography by Chota K Naidu is Top notch. There is nothing much to show in the movie but the way he picturised the songs and the scenes are eye feast for the audience. Production values are also excellent.
 
Negative points: The first half of the movie is bit slow. The comedy scenes featuring with Ali are irritating. There are some logics missed in climax. Editing is just about ok  although a few scenes could have been trimmed. The story remembers us  Gaganam movie done by Nagarjuna.
 
Performances: Already said that the lead pair Sundeep Kishan and Nithya Menon delivered a superb performances. Ravi Kishan who played as antagonist done justice to his role. Jhansi,Ajay,Thanikella bharani,Thagubothu ramesh, 30 years industry Prudvi, Dhanraj, Brahmaji, etc all did justice to their roles.
 
Verdict: Oka ammai thappa is a Bold and Brave attempt by Raja Simha which has a gripping second half with some good twists. Finally it is a worth watch movie for all the performance of lead actors and a thrilling story.
ఒక్క అమ్మాయి త‌ప్ప రివ్యూ
 
దాదాపు ఏడేళ్ల నిరీక్ష‌ణ తర్వాత ద‌ర్శ‌కుడు రాజ‌సింహ ఒక్క అమ్మాయి త‌ప్ప సినిమా తో వ‌స్తున్నాడు. త‌న జీవితంలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న ఆధారంగా తెర‌కెక్కించిన ఈ సినిమా ఈ రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైంది. టైటిల్ తోనే వివాదాలు ఎదుర్కొన్న ఒక్క అమ్మాయి త‌ప్ప ఎలా ఉందో చూద్దాం .
ప్ర‌తి ప‌రిస్థితిని, ప్ర‌తి స‌మ‌స్య‌ను తెలివిగా అధిగ‌మించే సందీప్ కిష‌న్ ఒక‌రోజు ఫ్లైఓవ‌ర్ మీద ఎనిమిది గంట‌ల పాటు ట్రాఫిక్ లో ఇరుక్కునిపోతాడు. అప్పుడే అక్క‌డ త‌న చిన్ననాటి స్నేహితురాలు నిత్య‌మీన‌న్ చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు సందీప్. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఆ ఫ్లై ఓవ‌ర్ మీద బాంబ్ ఉంద‌ని తెలుసుకోవ‌డంతో అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. అస‌లు ఆ ఫ్లై ఓవ‌ర్ మీద బాంబ్ ఎందుకు పెట్టారు.. వారిద్ద‌రీ ప్రేమ అక్క‌డినుంచి ఎలా మ‌లుపు తిరిగింది, ఆ ప‌రిస్థితుల నుంచి వాళ్లు ఎలా బ‌య‌ట‌పడ్డారు అన్న‌దే మిగ‌తా క‌థ‌.
సందీప్ కిష‌న్ త‌న న‌ట‌నా ప్ర‌తిభను మొత్తం ఈ సినిమాలో చూపించాడు. త‌న న‌ట‌న ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ట్టుకునే విధంగా ఉంటుంది. ఇక నిత్య‌మీన‌న్ న‌ట‌న గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇద్ద‌రూ వాళ్ల వాళ్ల న‌ట‌న‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. విల‌న్ గా ర‌వికిషోర్ త‌న పాత్ర‌కు బాగా న్యాయం చేశాడ‌నే చెప్పుకోవాలి. ఝాన్సీ, అజ‌య్, త‌నికెళ్ల భ‌ర‌ణి, తాగుబోతు ర‌మేష్, పృథ్వీ, ధ‌న‌రాజ్, బ్ర‌హ్మాజీ, త‌మకు ఉన్నంత‌లో బాగానే చేశారు.
సినిమా విష‌యానికొస్తే.. ద‌ర్శ‌కుడు రాసుకున్న క‌థ, ప్ర‌తి ఒక్కరికీ న‌చ్చేలా, ఆకట్టుకునేలా ఉంటుంది. త‌న నిజ‌జీవితంలో జ‌రిగిన ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ను తెర‌కెక్కించాల‌న్న ఆలోచ‌న‌ను మెచ్చుకోవాలి. సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నాడు. మిక్కీ జే మేయ‌ర్ అందించిన నేప‌థ్య సంగీతం సినిమాను ఇంకో స్థాయికి తీసుకెళ్తుంది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే సినిమాటోగ్ర‌ఫీ ఛోటా కె. నాయుడు గురించి. అంత‌గా సినిమాలో చూపించ‌డానికి ఏమీ లేదు కానీ త‌న కెమెరా ప‌నితీరు, పాట‌ల‌ను చిత్రీక‌రించిన విధానం, కొన్ని స‌న్నివేశాలు క‌న్నుల పండుగ‌గా అనిపిస్తాయి. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. సినిమా ద్వితీయార్థం బాగున్న‌ప్ప‌టికీ, ప్ర‌థ‌మార్థం మాత్రం చాలా స్లోగా అనిపిస్తుంది. అలీ తో వ‌చ్చే కామెడీ సీన్స్ కూడా న‌వ్వు తెప్పించ‌క‌పోగా, చికాకు క‌లిగిస్తాయి. క్లైమాక్స్ లో వ‌చ్చే కొన్ని సీన్స్ లో లాజిక్ ప‌రంగా చూస్తే చాలా త‌ప్పులు దొర్లుతాయి. ఎడిటర్ త‌న క‌త్తెర‌కు ఇంకొంచెం ప‌ని చెప్పి ఉంటే బాగుండేది. సినిమా చూస్తున్నంత సేపు క‌థ మొత్తం నాగార్జున హీరోగా తెర‌కెక్కిన గ‌గ‌నం సినిమానే గుర్తు చేస్తుంది.
చివ‌ర‌గా, ఒక్క అమ్మాయి త‌ప్ప అనేది రాజ‌సింహ చేసిన చ‌క్క‌ని ప్ర‌య‌త్న‌మ‌ని చెప్పాలి. మంచి న‌టుల‌తో తెర‌కెక్కిన ఈ థ్రిల్ల‌ర్ ను ఏదో టైమ్ పాస్ కు అలా ఒక‌సారి వెళ్లి చూసిరావ‌చ్చు.

Punch Line: An Intense And Brave Attempt

FilmJalsa Rating: 3/5


Follow Us