Oka Manasu Trailer Talk


అమ్మ ప్రేమంత స్వ‌చ్ఛ‌మైన‌ ఒక‌ మ‌న‌సు

 
నిహారిక.. మెగా ఫ్యామిలీ నుంచి వ‌స్తున్న మొట్ట మొద‌టి హీరోయిన్. మెగా హీరోయిన్ అంటే ఎలా ఉంటుందో అనుకున్నఅభిమానుల ఆలోచన‌ల‌కు తెర‌పడింది.నిహారిక మొద‌టి సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది.తన కుటుంబం నుంచి వ‌చ్చిన హీరోలంద‌ర‌కీ నిహా గ‌ట్టిగానే పోటీ ఇచ్చేలా ఉంది.ట్రైల‌ర్ లో ఎంతో కాన్ఫిడెంట్ గా, బ‌బ్లీగా, మ‌న తెలుగింటి అమ్మాయిలా ద‌ర్శ‌నిమిచ్చింది ఈ మెగా ప్రిన్సెస్.నాగ‌శౌర్య హీరోగా రామ‌రాజు తెర‌కెక్కించిన ఈ చిత్ర ఆడియో మెగా హీరోలంద‌రి స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది.
మొన్న ఈ మ‌ధ్య విడుద‌లైన టీజ‌ర్ లో నిహారిక న‌ట‌న‌కు అవ‌కాశం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ట్రైల‌ర్ మొత్తం నిహారిక త‌ప్ప ఎవ‌రూ క‌నిపించ‌ట్లేదు. పండు వెన్నెల్లో సాగ‌ర తీరాన అల‌లు తాకుతూ ఉంటే మ‌న‌సుకు ఎంత ప్ర‌శాంత‌త‌, హాయిని ఇస్తుందో ఒక మ‌న‌సు ట్రైల‌ర్ చూస్తే కూడా అలాగే అనిపిస్తుంది. ట్రైల‌ర్ మొత్తం చాలా పీస్ ఫుల్ గా, క్లాస్ గా సాగిపోతుంది. డైర‌క్ట‌ర్ వంశీ సినిమాలోని హీరోయిన్ లాగే నిహారిక చాలా అందంగా క‌నిపిస్తుంది.
ద‌ర్శ‌కుడు చెప్పిన‌ట్లే నాగ‌శౌర్య‌, నిహారిక సినిమాకు ప్రాణం పోసేట్లు క‌నిపిస్తున్నారు. జంట కూడా స్క్రీన్ మీద చూడ‌ముచ్చట‌గా ఉంది. ప్రేమ‌, కుటుంబం,బాధ్య‌త‌లు, బంధుత్వాలు, వాటి విలువ‌ల‌తో ముడిప‌డిన ఈ సినిమా ఒక చ‌క్క‌ని మ్యూజిక‌ల్ ల‌వ్ ఎంట‌ర్ టైనర్ గా తీర్చిదిద్దారు అని ట్రైల‌ర్ ని చూస్తే అర్థ‌మ‌వుతుంది.పైగా ట్రైల‌ర్ చివ‌ర్లో నిహారిక చెప్పే ''నీ మీద ప్రేమా చావ‌దు.. ఇంకొక‌రి మీద ప్రేమ పుట్టదు సూర్య'' అనే డైలాగ్ అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే విధంగా ఉంది. ట్రైల‌ర్ మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కు ఉన్న లొకేష‌న్లు, కెమెరా ప‌నితీరు, మ్యూజిక్.. అన్నీ ఒక మ‌న‌సు మీద ఆశ‌లు రేపుతున్నాయి.
https://www.youtube.com/watch?v=h_rI8pqOvgY  
Filmjalsa Rating : 3.75/5