''o Malli'' Review


" O Malli " this movie shooting completed before 2 years but due to anonymous reasons this movie got a break. " Ramya Sri " well know for her roles of Item girl ,vamp & actress from last one decade. She is the director of " O MALLI " ...Did this movie impressed audience?? Let's get in detail.. " O MAlli " is a simple story of a tribal girl lives in Araku valley with her father who is drunk all the time. This complete movie flies around Malli & living after her father death. Ramya sri been an all rounder in the whole film. She blended herself as a tribal Araku girl..                                                                                                                                         She lead every one with her direction skills..Other actors too portrayed their characters very well..especially RaghuBabu as malli's husband who got Paralyzed in the second half. L.B.Sriram as drunker, Akash as Ticket collector who likes malli . Here Akash too played a major role . Story , Screen play , Music , Acting...Director tried her best in every corner of the film. But , their is lot of lag in screen play as it is very slow, Songs are meaning full but they are presented in unconditional situations,audience will be disappointed with predicted story . Ramya Sri Tried to explain the problems of the women who become call girls due to their financial crisis,but she failed to present that concept in a right way.. These are the major drawbacks of the film which let audience to go boredom. Impressive point in the film is climax, Ramya Sri's acting is extraordinary & her message feels like it is inspired from India. Though movie was routine, Director got success by presenting it in a interesting way. Cinematography by " K.Dathu " & he presented Araku very beautifully. Songs were very lively by Sunil Kashyap & B.S.Bala KrishnaMurthy , but they couldn't impress viewers much. V.NagiReddy is the editor & Art Director presented his work very close to the traditional living of tribalism & he proved himself as a best art director with this movie. Production values are rich in " O Malli ". Story Line ..One Misunderstanding will makes way for disasters.  
 దాదాపు రెండు సంవత్సరాల క్రితమే సినిమా పూర్తి అయినా విడుదల వాయిదా పడుతూ వచ్చిన సినిమా ’ఓ మల్లి’. నటిగా,ఐటం గాళ్‌గా, వ్యాంప్‌ పాత్రల్లో నటిస్తూ దాదాపు దశాబ్దం పైగా సినిమాల్లో ఉన్న రమ్యశ్రీ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో చూద్దాం...
  సింపుల్ గా చెప్పాలంటే.. అర‌కు లోయ‌లోని ఓ గూడెంలో తాగుబోతు తండ్రి పెంప‌కంలో పెరిగిన మ‌ల్లి అనే యువ‌తి జీవ‌నం త‌న తండ్రి చ‌నిపోయాక ఎలా సాగింది అన్న‌దే సినిమా క‌థ‌. మొద‌ట‌గా తాను అనుకున్న విష‌యాన్ని ప్రెజెంట్ చేయాల‌నుకున్న ర‌మ్య‌శ్రీని మెచ్చుకోవ‌చ్చు. అచ్చు అరకు ప్రాంతంలో ఉండే ప్ర‌జ‌ల మాదిరిగానే త‌న గెట‌ప్ ను మార్చుకుంది. సినిమాకు అన్నీ తానై ముందుకు న‌డిపించింది. ఇతర నటీనటుల నుంచి నటనను రాబట్టుకోవడంలో కూడా దర్శకురాలిగా రమ్యశ్రీ మంచి మార్కులు కొట్టేసిందని చెప్పవచ్చు. ఫ‌స్టాఫ్ లో కంటే సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ని కొంచెం ఆసక్తి కలిగిస్తాయి. మ‌ల్లి భ‌ర్త‌గా న‌టించిన ర‌ఘుబాబు ప‌క్ష‌వాతం వ‌చ్చిన వాడి పాత్ర‌లో మెప్పించాడు. తాగుబోతుగా ఎల్.బి శ్రీరామ్, టికెట్ క‌లెక్ట‌ర్ గా మ‌ల్లిని ఇష్ట‌ప‌డే పాత్ర‌లో ఆకాష్ బాగా చేశారు. చాలా సీన్స్ ఎక్కడో చూసినట్టుగానే అనిపించినా కొత్త‌గా ప్ర‌జెంట్ చేయ‌లేక‌పోయింది ద‌ర్శ‌కురాలు. స్క్రీన్ ప్లే స్లో గా ఉండ‌టం వ‌ల్ల  మ‌నం ఊహించిందే జ‌రుగుతుంది అని ప్రేక్ష‌కులు  ఫీలయ్యే  ఛాన్స్ ఇచ్చింది ర‌మ్య‌శ్రీ. దీంతో డైరెక్టర్ తాను చెప్పాలనుకున్న పాయింట్ ఆడియ‌న్స్ కి చేరే ఛాన్స్ తక్కువ. క‌థ  బాగున్న‌ప్ప‌టికీ దాని ప్రెజెంటేష‌న్ లో మాత్రం ఏదో మిస్స‌యింది అన్న ఫీలింగ్. సంద‌ర్భం లేకుండా వ‌చ్చే పాట‌లు అర్థ‌వంతంగా ఉన్నా, ఆ టైమ్ లో పాట ఏంటి  అని అస‌హ‌నానికి  గురిచేస్తాయి. ఆర్థిక లేమి వలన అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్న స్త్రీల గురించి హాస్యంగా చిత్రీకరించడంతో దర్శకురాలు చెప్పాలనుకున్న అంశం కూడా పక్కదారి పట్టింది. క్లైమాక్స్ లో ర‌మ్య‌శ్రీ న‌ట‌న ప్రేమిస్తే సినిమా క్లైమాక్స్ లో భ‌ర‌త్ ని స్పూర్తిగా తీసుకుని చేసిన‌ట్ల‌నిపిస్తుంది. కథ సాధారణంగా ఉన్నా ఎక్కడా విసిగించకపోవడం దర్శకురాలు రమ్యశ్రీ సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. కె.ద‌త్తు అందించిన సినిమాటోగ్ర‌ఫీ చాలా బాగుంది.అరకులోయ అందాలను అద్భుతంగా చూపించాడు. సునీల్ కశ్యప్, బి.ఎస్.కృష్ణమూర్తి అందించిన పాటలు బాగున్న‌ప్ప‌టికీ అస‌హ‌నానికి గురిచేసింది. వి. నాగిరెడ్డి ఎడిటింగ్ బావుంది కానీ ఇంకొంచెం క‌త్తెరకు ప‌దును  పెట్టిన‌ట్ల‌యితే  ఇంకా బావుండేది. సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఆర్ట్  డైర‌క్ట‌ర్  ప‌నిత‌నం గురించి. సహజత్వానికి దగ్గరగా ఉండేలా ప్రతీ లొకేషన్ ని తీర్చిదిద్దారు. మాట‌లు కూడా చాలా సాధారణంగా ఉంటూనే హృదయానికి హత్తుకునే విధంగాఉన్నాయి. సహజత్వానికి దగ్గరగా భాష, యాసలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఆకట్టుకునే అంశం. నిర్మాణ విలువలు బాగున్నాయి. చివ‌ర‌గా... ఒక అపార్థం ఎన్నో అనార్థ‌ల‌కు దారితీస్తుంద‌ని  ఈ చిత్రం ద్వారా  అర్థ‌మ‌వుతోంది. Filmjalsa Rating: 2.5/5
Thank You For Reading.


Follow Us