Nityamenon In Hollywood Movie


అలా మొద‌లైంది తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన నిత్య  తొలిసినిమాతోనే త‌నకంటూ ఒక బ‌ల‌మైన ముద్ర వేసుకుంది. ఆమెను చూసి యువ‌త గుండె జారి గ‌ల్లంత‌య్యింది. ప్ర‌తి సినిమాలోనూ ప్ర‌త్యేకంగా ఆక‌ట్టుకుంది. ఆమె న‌ట‌న‌కు మ‌ణిర‌త్నం లాంటి లెజెండ‌రీ డైర‌క్ట‌ర్ సైతం మగ్దుడ‌య్యాడంటే అర్థం చేసుకోవచ్చు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు.  నిత్యామీనన్ కు సంబంధించిన ఈ వీడియో చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. సౌత్ ఇండియాలోనే అత్యుత్తమ నటీమణుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న నిత్యా.. చిన్న తనంలోనే తన టాలెంట్ చూపించింది. ఏడెనిమిదేళ్ల వయసులోనే ఆమె ఎంత బాగా నటించిందో ‘ది మంకీ హు న్యూ టూ మచ్’ అనే ఇండియన్ ఇంగ్లిష్ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆ సినిమాలో నిత్య బాలనటిగా చేసింది. సీనియర్ నటి టబుకు చెల్లెలిగా కనిపించింది నిత్య అందులో. ఎంతో ముద్దుగా కనిపిస్తూ చక్కటి హావభావాలు పలికిస్తూ మెస్మరైజ్ చేసింది ఆ సినిమాలో నిత్య. ఈ సినిమాకు సంబంధించి నిత్య లుక్స్ తో రిలీజైన ఓ చిన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో ఆమె నటించిన ‘ఒక్క అమ్మాయి తప్ప త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు తమిళ.. మలయాళ.. కన్నడ భాషల్లోనూ క్రేజీ సినిమాలు చేస్తోంది నిత్య. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘జనతా గ్యారేజ్’లోనూ ఆమె ఓ కీలక పాత్ర పోషిస్తోంది నిత్య మీన‌న్. https://www.youtube.com/watch?v=qDJOSFBleGQ


Follow Us