Nithya Menen Reveals Her Role In Janatha Garage


జ‌న‌తా గ్యారేజ్ లో నా పాత్ర‌ అదే-నిత్య‌
 
జ‌న‌తా గ్యారేజ్. ప్ర‌స్తుతం అందరి నోటిలోనూ ఉన్న సినిమా పేరు. ఎన్టీఆర్, స‌మంత‌, నిత్య మీన‌న్, మోహ‌న్ లాల్ ముఖ్య పాత్ర‌ల్లో కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న చిత్రం. హీరో ఎన్టీఆర్. మెయిన్ హీరోయిన్ స‌మంత, నిత్య మీన‌న్ సెకండ్ హీరోయిన్. ఇప్ప‌టివ‌ర‌కు అంద‌రూ చెప్పుకుంటున్న మాట‌లు ఇవి. అయితే నిత్య మీన‌న్ ఇప్పుడు జ‌న‌తా గ్యారేజ్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యం ఒక‌టి బ‌య‌ట‌పెట్టింది.
ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌తా గ్యారేజ్ లో నిత్య మీన‌న్ కు సంబంధించిన ఏ విష‌యం రివీల్ కాకుండా అంద‌రినీ సస్పెన్స్ లో పెట్టాడు శివ. కానీ, ఇప్పుడు నిత్య చెప్పిన మాట వింటే ఏంటీ నిజ‌మా... అన‌క మాన‌రు. అదేంటో తెలుసా..జ‌న‌తా గ్యారేజ్ లో మెయిన్ హీరోయిన్ స‌మంత కాద‌ట‌. నిత్య‌నే మెయిన్ హీరోయిన్ అట‌. అవును ఈ మాట స్వ‌యంగా నిత్య నే చెప్పింది. సినిమాలో నా పాత్రే కీల‌కం అంటూ చెప్పి, అంద‌రినీ అయోమ‌యంలో ప‌డేసింది నిత్య‌.
అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌కు వ‌చ్చిన ట్రైల‌ర్, పోస్ట‌ర్స్ ను చూస్తే మాత్రం, నిత్య ఒక్క పాట‌లో, ఏదో ఒక డైలాగ్ లో త‌ప్ప త‌న‌కేమీ ఇంపార్టెన్స్ లేదు. అంటే కావాల‌నే నిత్య క్యారెక్ట‌ర్ ను బ‌య‌ట పెట్ట‌కుండా కొర‌టాల శివ జాగ్ర‌త్త ప‌డ్డాడా అంటూ, నిత్య క్యారెక్ట‌ర్ ఏమై ఉంటుందా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్ష‌కులు. సెప్టెంబ‌ర్ 1న జ‌న‌తా గ్యారేజ్ ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే.


Follow Us