Nani Hopes On Gentleman


జెంటిల్ మెన్ పై ఆశ‌లు పెట్టుకున్న నాని
నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా తెర‌కెక్కిన చిత్రం జెంటిల్ మెన్. ఇది రొటీన్‌గా ఉండే క‌మ‌ర్షియ‌ల్ ఫిల్మ్ కాద‌ట‌. ట్విస్ట్‌లు, డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్, అన్నీ కొత్త‌గానే ఉంటాయ‌ట‌. అన్నీ విష‌యాల్లో కొత్త‌గా ఉండ‌నున్న ఈ సినిమా త‌న‌కు త‌ప్ప‌కుండా హిట్ట‌వ్వాలి అంటున్నాడు నాని.
ఈ సినిమా డైర‌క్ట‌ర్ కు హిట్ ఇవ్వ‌డం కోసం, కొత్త క‌థ‌ల‌ను ఎంక‌రేజ్ చేయ‌డం కోసం, ఈ సినిమా చేయొద్ద‌ని చెప్పిన వారందరికీ వారు త‌ప్పు అని ప్రూవ్ చేయ‌డం కోసం.. ఈ మూడు రీజ‌న్ల కోస‌మైనా ఈ సినిమా చూడొచ్చంటూ చెప్పుకొచ్చాడు నాని. అస‌లు ఈ సినిమాలో నాని పాజిటివ్ రోల్ చేస్తున్నాడా, నెగిటివ్ రోల్ చేస్తున్నాడా అనే తేడా లేకుండా ట్రైల‌ర్స్ తో క‌న్ఫ్యూజ్ చేస్తున్న ఈ వీర ప్రేమికుడు జెంటిల్ మెన్ గా నిరూపించుకుంటాడో లేదో తెలియ‌లాంటే జూన్ 17వ‌ర‌కు వేచిచూడాల్సిందే.
  https://www.youtube.com/watch?v=MgmowJ5r-es


Follow Us