Nani Hopes On Gentleman


పెద్ద సాహ‌సం చేసిన నాని
మిత్రుడు లాంటి డిజాస్ట‌ర్ అందించిన ప్రొడ్యూస‌ర్ శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్, బందిపోటు లాంటి అట్ట‌ర్ ఫ్లాప్ తీసిన డైర‌క్ట‌ర్ ఇంద్ర‌గంటి, ఒక‌ప్పుడు స్టార్ హీరోల‌తోనే ప‌నిచేసి, ఈ మ‌ధ్య ఎవ‌రికీ ప‌ట్ట‌కుండా పోయిన మ్యూజిక్ డైర‌క్ట‌ర్ మ‌ణిశర్మ‌. వీరి ముగ్గురికి అవ‌కాశం ఇస్తూ వీళ్ల‌తో సినిమాకు నాని ఒప్పుకోవ‌డం పెద్ద సాహ‌స‌మే. ఈ సినిమా చేయొద్ద‌ని చాలామంది వ‌ద్ద‌న్న‌ప్ప‌టికీ నాని ఏ మాత్రం త‌గ్గ‌కుండా సాహ‌సించాడు. అయితే నాని చేసిన సాహ‌సానికి ఎలాంటి ఫ‌లితం వ‌స్తుందా అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. త‌న ఇమేజ్ కు భిన్నంగా నాని చేస్తున్న ఈ సినిమా ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగానే ఉన్న‌ప్ప‌టికీ, ఈ ప్ర‌య‌త్నం ఏ మాత్రం బెడిసికొట్టినా నాని కెరీర్ కు పెద్ద గండే ప‌డుతుంది.
భ‌లే భ‌లే మ‌గాడివోయ్, కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాధ‌తో స్టార్ ఇమేజ్ సంపాదించిన నాని నెక్ట్స్ లెవెల్ కు క‌రెక్ట్ గా పునాది ప‌డిన టైమ్ లో, ఎవ‌రైనా స్టార్ డైర‌క్ట‌ర్ తో సినిమా చేస్తే ఆ రేంజే వేరుగా ఉండేది.బిజినెస్ కు బిజినెస్, సక్సెస్ అయితే క‌లెక్ష‌న్లకు క‌లెక్ష‌న్స్. కానీ ఇప్పుడు నాని చేసిన సాహ‌సానికి బిజినెస్ మాత్రం అనుకున్నంత స్థాయిలో జ‌ర‌గ‌ట్లేదు. సినిమాకు అన్ని ఏరియాల నుంచి ఆఫ‌ర్లు వ‌స్తున్న‌ప్ప‌టికీ అవి ఏమాత్రం ఆశాజ‌న‌కంగా లేవు. కానీ సినిమా మీద మాత్రం నాని స‌హా అంద‌రూ పాజిటివ్ గానే ఉన్నారు. చూద్దాం నాని సాహ‌సానికి ఫ‌లితం ఎలా ఉంటుందో.