Nandamuri Mokshagna As Asst Director To Nbk100?


గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి అసిస్టెంట్ డైర‌క్ట‌ర్ గా మోక్షజ్ఞ‌? నంద‌మూరి మోక్ష‌జ్ఞ‌.. బాల‌కృష్ణ ముద్దుల త‌న‌యుడు. ఈ న‌ట‌వార‌సుడి తెరంగేట్రం కోసం నంద‌మూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ హ‌డావుడి చేస్తూ వ‌స్తున్నారు. అయితే, తాజాగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో మరో ప్రచారం వినబడుతోంది. అదేంట‌బ్బా అంటే... బాలయ్య న‌టిస్తున్న100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి మోక్షజ్ఞ అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేస్తున్నాడ‌ని. ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్ అనే సంగతి తెలిసిందే. క్రిష్ వద్ద అసిస్టెంట్ డైర‌క్ట‌ర్ గా  మోక్షజ్ఞ పనిచేసేందుకు ఉత్సాహం చూప‌డంతో బాల‌య్య సంతోషంతో వెంట‌నే క్రిష్ కి చెప్పి డైర‌క్ష‌న్ డిపార్ట్మెంట్ లో చేర్పించార‌నే వార్త‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇదిలా ఉండ‌గా.. గతంలో బాలయ్య కూడా తన తండ్రి ఎన్టీఆర్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేసారు. వచ్చే సంవత్సరం మోక్ష‌జ్ఞ‌ లాంచ్ అవటానికి రంగం సిద్దం చేస్తున్న సమయంలో బాలయ్య ఈ డేరింగ్ నిర్ణయం తీసుకున్నాడని చెప్తున్నారు. దాంతో లైవ్ ఎక్సపీరియన్స్ ఉంటుందని, అలాగే డైరక్టర్ కష్టాలు తెలుస్తాయని, తద్వారా డైరక్టర్స్ తో ఎలా మెలగాలి, వాళ్లకు అణుగుణంగా తమను తాము ఎలా మలుచుకోవాలననే విషయాలు తెలిసేందుకు అవ‌కాశం ఉందని చెప్పుకుంటున్నారు.


Follow Us