Megastar Impressed With Kobbarimatta Teaser


'చిరు'న‌వ్వుతో సంపూ హ్యాపీ
 
మొద‌టి సినిమాతోనే త‌న‌కు తానే బ‌ర్నింగ్ స్టార్ అని బిరుదిచ్చేసుకుని విజ‌యం అందుకున్నాడు సంపూ. ఇప్పుడు ఈ బ‌ర్నింగ్ స్టార్ ఆనందానికి అవ‌ధుల్లేవు. సంపూ న్యూ మూవీ కొబ్బ‌రిమ‌ట్ట టీజ‌ర్ కు సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన రెస్పాన్స్ వ‌చ్చేయడంతో టీజ‌ర్ సెన్సేష‌నల్ హిట్ట‌యింది. 5ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ రావ‌డంతో యూట్యాబ్ లో టాప్ ట్రెండింగ్స్ లో చోటు ద‌క్కించుకుంది.చాలా మంది సెల‌బ్రిటీలు సైతం ఈ టీజ‌ర్ గురించి పాజిటివ్ గా స్పందించారు.
ఇదిలా ఉండ‌గా సంపూ ఆనందాన్ని డ‌బుల్ చేసే ఇన్సిడెంట్ ఒక‌టి చోటు చేసుకుంది. నిన్న సినీ కార్మికుల‌కు సంబంధించిన స‌న్మాన వేడుక‌కు చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రాగా, సంపూ అక్క‌డికి వెళ్లి చిరును క‌లిసి త‌న టీజ‌ర్ ను చూపించాడు. సంపూ డైలాగ్ చూస్తూ న‌వ్వి , టీజ‌ర్ బాగందంటూ సంపూని అప్రిషియేట్ చేశాడు. కేవ‌లం సోష‌ల్ మీడియాను న‌మ్ముకుని ఎదిగిన సంపూకి మెగాస్టార్ నుంచి ప్ర‌శంస‌లు అందుకోవ‌డం మామూలు విష‌యం కాదు.