Mahesh "the Bussiness Man"


ఎంత పెద్ద స్టార్ హీరోకి అయినా సినిమా ప్ర‌మోష‌న్ మోస్ట్ ఇంపార్టెంట్. కానీ మన టాలీవుడ్లో ప్ర‌మోష‌న్ విష‌యంలో హ‌ద్దులు చాలానే ఉన్నాయి. కానీ హద్దుల్ని చెరిపేసిన హీరో మహేష్, గ‌త కొన్ని సినిమాల‌ నుంచి మహేష్ తన సినిమాల్ని చాలా అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు. సరిగ్గా ప్రమోట్ చేస్తే ఓ సినిమా రేంజ్ ఎలా పెరుగుతుందో ‘శ్రీమంతుడు’తో చాలా బాగా చూపించాడు మహేష్. ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’ విషయంలోనూ అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. ఆడియో డేట్ ఫిక్సవడం ఆలస్యం.. వరుసగా ప్రతి రోజూ సినిమాకు సంబంధించి ఏదో ఒక విశేషంతో అభిమానుల్ని పలకరిస్తూనే ఉంది ‘బ్రహ్మత్సవం’ టీమ్. మోషన్ పోస్టర్ తో పాటు కొత్త కొత్త క‌ల‌ర్ ఫుల్ పోస్ట‌ర్లు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఆ తర్వాత వ‌చ్చింది క‌దా అవ‌కాశం అంటూ టీజ‌ర్ రిలీజ్ చేశారు. త‌ర్వాత మ‌ధురం.. మ‌ధురం అంటూ ఒక బ్యూటిఫుల్ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఆపై ‘వచ్చింది కదా అవకాశం’ పాట లిరిక్స్ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడిక ఆడియో విడుదలకు రెండు రోజుల ముందే.. గురువారం నాడు ఇంకొన్ని పాటల ప్రోమోలు రిలీజ్ చేయబోతున్నారట. ఈ ప్రోమోలన్నీ చాలా కలర్ ఫుల్ గా ఉంటాయని అంటున్నారు. ఆడియో విడుదలయ్యాక ఎలాగూ ఆ సందడి ఓ వారమైనా ఉంటుంది. ఆపై విడుదలకు ముందు వారమంతా మహేష్ బాబు సహా యూనిట్ సభ్యులంతా సినిమాను ప్రమోట్ చేస్తారు. ఇలా అభిమానులకు ఏమాత్రం ఊపిరి తీసుకునే అవకాశమివ్వకుండా మంచి ప్రమోషనల్ ప్లాన్ తో రెడీ అయి ఉన్నాడు మహేష్.


Follow Us