Mahesh Shows His Love On Fans


శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో, సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా తెర‌కెక్కుతున్న బ్ర‌హ్మోత్స‌వం ఆడియో మార్కెట్ లోకి విడుద‌లైంది. మ‌హేష్ ఆడియో లాంచ్ కు స్పెషల్ గెస్ట్ ఎవ‌రైనా వ‌చ్చినా కూడా ఆడియో ఫంక్ష‌న్లో మ‌హేషే హైలెట్ అవుతాడు. అత‌ని క్రేజ్ అలాంటిది. అయితే సాధారణం మహేష్ బాబు ఆడియో ఫంక్షన్లలో చాలా సైలెంట్ గా ఉంటాడు. పెద్దగా హ‌డావుడి చేయ‌డు. కానీ బ్రహ్మోత్సవం ఆడియో ఫంక్షన్లో మాత్రం, మహేష్ చాలా యాక్టివ్ గా కనబడ్డారు. స్టేజ్ పై మాట్లాడేట‌ప్పుడు కూడా ప్రతీసారి కంటే ఈసారి చాలా ఎక్స్ ప్రెసివ్ గా మాట్లాడారు. దానికి కార‌ణం ఏంటా అని మొద‌టి నుంచి ఆడియో చూస్తున్న వారికి సందేహం క‌లిగింది. చివ‌ర‌గా మ‌హేష్ మాట్లాడుతూ..అసలు కార‌ణం చెప్పారు. ''ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఈరోజు సితార పాప రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే తను వచ్చిన మొదటి ఆడియో ఫంక్షన్. అంతా మంచే జరుగుతుంది. " అంటూ మహేష్ తన స్పీచ్ ను మొద‌లెట్టిన మ‌హేష్.. తన బ్ర‌హ్మోత్స‌వం సినిమా టీమ్ లోని ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. ఇదిలా ఉండ‌గా ఆడియో లాంచ్ లో మ‌హేష్ ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల గురించి ఒక వ్యాఖ్య చేశాడు. శ్రీకాంత్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆయ‌నొక ప్యూర్ హ్యూమ‌న్ బీయింగ్. మ‌న ఇండ‌స్ట్రీ వాళ్ల‌తో ఆయ‌న ఎక్కువగా క‌ల‌వ‌డు. అందుకే ఆయ‌న అలా ఉంటాడేమో.. అంటూ మ‌హేష్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అయినా మ‌హేష్ అలా ఎందుకు అన్న‌ట్లు.. మ‌న ఇండస్ట్రీ వాళ్ల‌తో క‌లిస్తే మంచి వాళ్లుగా ఉండ‌లేరా.. అని మ‌హేష్ వ్యాఖ్య‌ల‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. త‌ర్వాత ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. నేనెప్పుడూ మీ గురించి పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడలేదు. ఎందుకంటే మ‌న‌కి ఎవ‌రి మీదైనా నిజంగా ప్రేమ ఉంటే అది మాట‌ల్లో చెప్ప‌లేం. నాకు స‌పోర్ట్ చేసి, న‌న్ను ఇంత‌టి వాడిని చేసినందుకు మీకు ఋణ‌ప‌డి ఉంటా.. మీరెప్పుడూ నా గుండెల్లోనే ఉంటారు అంటూ ఫ్యాన్స్ మీద త‌న‌కున్న ప్రేమ‌ను చాటి చెప్పారు. మే 20 న బ్ర‌హ్మోత్స‌వాలు మొద‌ల‌వబోతున్నాయి. మ‌నంద‌రికీ పెద్ద పండ‌గలా ఉండాల‌ని కోరుకుంటున్నార‌ని మ‌హేష్ అన్నారు.   Watch Brahmotsavam Theatrical Trailer Here: https://www.youtube.com/watch?v=cWRYYZjCMgY