Mahesh In Burri Palem


MAHESH VISIT TO BURRIPALEM

  MAHESH BABU...The name itself creates vibrations to Fans... From last few years so many big shots & politicians Adopted villages which are in under privileged condition. Hero Mahesh Babu got inspired from the movie "SREEMANTHUDU" & adopted his home town BURRIPPALEM in Andhra Pradesh. After adopting his village mahesh did not visit it atleast once before this , as he say's "people would be thinking i'm up for promoting the movie 'Sreemanthudu' ". I took a little time to schedule my trip to Burripalem and i was on my word developing my village. Our milky boy Mahesh & his brother in-law Galla Jayadev recently visited BURRIPALEM. Mahesh funded Rs-2 Crores for village development. He distributed house documents & health cards to poor people & Rs-1crore for women development organization. Mahesh fans flooded to Burripalem to see him.It has been a tough job to police battalion to control the public. While speaking to villager's Mahesh shared his thoughts that 'Burripalem' is his home land & he will turn up his village into a inspirational one in the state. He promised to every one that he will be visiting them again & again ... Mahesh shared his motivational dialogue " URIKI YEDAINA CHEYALI...LEKAPOTHE LAVAIPOTHAM " which gave awakening thoughts to so many people around him. Mahesh undertook one more village called " SIDDAPURAM" in Telangana State ,which he will be visiting the next week.
బుర్రిపాలెంలో శ్రీమంతుడు
  'శ్రీమంతుడు' చిత్రాన్ని ఆదర్శంగా తీసుకుని పలువురు పారిశ్రామికవేత్తలు పలు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఇలాంటి వారిలో ఆ చిత్ర హీరో ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఒకరు. ఈయన తన తండ్రి హీరో కృష్ణ సొంతూరు అయిన బుర్రిపాలెంను దత్తత తీసుకున్నారు. ఇందులోభాగంగా మహేష్ బాబు కొద్ది సేప‌టి క్రితం బుర్రిపాలెం కు వెళ్లారు. త‌మ గ్రామాన్ని ఆద‌ర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాన‌ని మాటిచ్చిన 'శ్రీమంతుడు'కు గ్రామస్తులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.  త‌న బావ గ‌ల్లా జ‌య‌దేవ్ తో  వ‌చ్చిన మ‌హేష్ ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో వారిని పోలీసులు నియంత్రించ‌లేక‌పోయారు. రెండు కోట్ల రూపాయ‌ల అభివృద్ధి ప‌నులకు మహేష్ శంకుస్థాపన చేశారు. కోటి రూపాయ‌ల నిధుల‌ను మ‌హిళా సంఘానికి మ‌హేష్ అందించారు.ఊరిలోని పేద ప్ర‌జ‌లంద‌రికీ ఇళ్ల ప‌ట్టాల‌ని, హెల్త్ కార్డుల‌ను పంపిణీ చేశారు. బుర్రిపాలెం త‌న ఊరు అని, త‌న సొంత ఊరికి త‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌స్తాన‌ని, రాష్ట్రంలో ఆద‌ర్శ గ్రామంగా బుర్రిపాలెం ను మారుస్తాన‌ని చెప్పిన మ‌హేష్.. శ్రీమంతుడు సినిమా టైమ్ లోనే ఈ ఊరికి రావాల్సింది. కానీ ఆ టైమ్ లో వ‌స్తే సినిమా ప‌బ్లిసిటీకి వ‌చ్చానంటార‌ని కొంత స‌మ‌యం తీసుకుని ఆల‌స్యంగా వ‌చ్చా.. అని మాట్లాడారు.సొంత ఊరుకు ఏదైనా చేయాలి.. లేక‌పోతే లావైపోతాం అన్న సందేశాన్ని చాటిన ఈ శ్రీమంతుడు బుర్రిపాలెంతో పాటు, తెలంగాణలోని సిద్దాపురాన్ని కూడా ద‌త్త‌త తీసుకున్నారు. వ‌చ్చే వారంలో సిద్దాపురానికి వెళ్తాన‌ని  మ‌హేష్ తెలిపారు.


Follow Us