Mahesh A Very Good Promoter


సూపర్ స్టార్ మహేష్ నటించిన బ్రహ్మోత్సవం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఓ రేంజ్లో ప్రమోషన్స్ చేస్తున్న ఈ సినిమా గురించి భారమంతా తన మీదే వేసుకున్నాడు మహేష్ బాబు. ఇక సినిమాలో ఒకటంటూ కాదు అన్ని హైలెట్ సీన్స్ అని చెబుతూ.. ఒక్క సన్నివేశం తనకు తన చిన్న నాటి రోజులు గుర్తొచ్చేలా చేసిందని రివీల్ చేశారు. ఇంతకీ మహేష్ కు బాగా నచ్చిన ఆ సన్నివేశం ఏంటంటే హీరో తన ఫ్యామిలీ మొత్తం ఊటీ వెళ్తారట. అక్క‌డ రైల్వే స్టేషన్ లో ట్రైన్ కోసం వెయిట్ చేసే సీన్ త‌న‌కు చిన్న‌నాటి రోజులు గుర్తుచేశాయ‌ని మ‌హేష్ చెప్పాడు. అంత‌మ‌ది ఆర్టిస్ట్ ల‌తో క‌లిసి ప‌నిచేయ‌డం ఒక గొప్ప అనుభూతి అని.. వారి నుంచి చాలా విష‌యాలు నేర్చుకున్నాన‌ని మ‌హేష్ చెప్పారు. సో బ్ర‌హ్మోత్స‌వంలో ఆ రైల్వే స్టేషన్ సీన్ హైలెట్ అవనున్నదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సత్యరాజ్ మహేష్ తండ్రిగా నటిస్తున్న ఈ సినిమాలో వారిద్ద‌రి మ‌ధ్య‌వ‌చ్చే స‌న్నివేశాలు ఎలాగూ ప్రేక్ష‌కుల‌ని ఆకట్టుకుంటాయి. mahesh-babu-brahmotsavam-13 ప్ర‌స్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న బ్రహ్మోత్సవం యూనిట్ అంతా సినిమా స‌క్సెస్ గ్యారెంటీ అంటూ నమ్మకంగా చెబుతున్నారు. మహేష్ అయితే సినిమా తన ఖాతాలో ఇంకో హిట్ పడ్డట్టే అని చెబుతున్నాడు. శ్రీమంతుడు తర్వాత మహేష్ చేస్తున్న సినిమాగా ఇది ఎంతటి సంచలన విజయం దక్కించుకోనుందో తెలుసుకోవాలంటే మరో నాలుగు రోజులు వెయిట్ చేయాల్సిందే. https://www.youtube.com/watch?v=cWRYYZjCMgY


Follow Us