Mahesh 25th Movie Details


మ‌హేష్ బాబు 25వ చిత్రం ఎప్పుడు?
  మ‌న టాలీవుడ్ లో రోజురోజుకీ అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు మ‌హేష్ బాబు. చిన్న‌వయ‌సులోనే త‌న తండ్రితో వెండితెర‌ను పంచుకున్న మ‌హేష్, టాలీవుడ్ కే రాకుమారుడు అంటూ ప్రిన్స్ ని చేసేశారు అభిమానులు.త‌రువాత త‌న స‌క్సెస్ ల‌తో ప్రిన్స్ నుండి సూప‌ర్ స్టార్ గా మారాడు.అయితే ఇప్పుడు మ‌హేష్ బాబు మ‌రో కీల‌క మైలురాయికి చేరువ‌వుతున్నాడు.మ‌హేష్ హీరోగా ఇప్పటికి 21 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 22 వ చిత్రంగా బ్రహ్మోత్సవం మే 20న విడుద‌ల కానుంది. అంటే సూప‌ర్ స్టార్@25 కి రెండు మూవీస్ మాత్రమే గ్యాప్ ఉంది. తన 25వ చిత్రంగా  మహేష్ ఏ సబ్జెక్ట్ ని ఎంచుకుంటాడు.. ఎవరికి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాడో అన్న‌ ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మ‌హేష్ తన 23వ సినిమాగా మహేష్ ఇప్పటికే ఓ ప్రాజెక్టును ఫైనలైజ్ చేసేశాడు. మురుగదాస్ తో తన నెక్ట్స్ మూవీ చేయనున్నాడు మహేష్ బాబు. బ్రహ్మోత్సవం రిలీజ్ తర్వాత మురుగుదాస్ తో మూవీపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. అయితే... దీని తర్వాత ప్రాజెక్టు కూడా ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చిందని అంటున్నారు. మహేష్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జన గణ మన.. సూపర్ స్టార్ 24వ సినిమాగా వచ్చే ఛాన్స్ ఉంది.  ఇప్పుడు మహేష్ సినిమాలు చేస్తున్న స్పీడ్ ప్రకారం... మురుగదాస్ మూవీ కంప్లీట్ చేయడానికి కనీసం 6 నెలల పడుతుంది. ఆ తర్వాత రిలీజ్  , మిగ‌తా ప‌నులు చూసుకున్నా.. వచ్చే ఏడాది ప్రారంభంలోనే 24వ సినిమా ఉంటుంది. అది కంప్లీట్ అయ్యేసరికి 2017చివరకు వచ్చేయడం ఖాయం. అంటే మహేష్ 25వ సినిమా ఏదో తెలియాలంటే కనీసం ఏడాదిన్నర ఆగక తప్పదన్న మాట. అయితే.. ఇప్పటినుంచే ఈ ప్రాజెక్టు కోసం పలువురు అగ్ర నిర్మాతలు మహేష్ ని సంప్రదిస్తున్నారని టాక్.


Follow Us