Kohli - Show Up His Craze In Hyderabad


న‌గ‌రంలో సంద‌డి చేసిన కోహ్లీ   స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నగరంలో సందడి చేశాడు. కూకట్ పల్లి ఫోరం మాల్ లో శుక్రవారం ఓ బట్టలషాపు ప్రారంభోత్సవానికి వ‌చ్చిన కోహ్లీ  తన సొంత బ్రాండ్ అయిన వ్రాగన్ దుస్తుల దుకాణాన్ని ప్రారంభించాడు. అభిమాన క్రికెటర్ రాకతో అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. అతడిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో ముచ్చ‌టించిన కోహ్లీ హైదరాబాద్ అంటే తనకు చాలా ఇష్టమని మనసులోని అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ఇక్కడ హైదరాబాదీయులు చాలా ఫ్యాషనబుల్ గా ఉంటారంటూ  కోహ్లీ కితాబు కూడా ఇచ్చాడు


Follow Us